Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమాయకంగా కనిపించే అవసరాల తక్కువోడేం కాదంటున్న బెంగాలీ భామ

మంగళవారం, 16 మే 2017 (12:18 IST)

Widgets Magazine
Mishti Chakraborty

దర్శకనటుడు అవరసరాల శ్రీనివాస్‌పై బెంగాలీ పాప మిస్తీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమాయకంగా కనిపించే అవసరాల శ్రీనివాస్ తక్కువోడేం కాదని అంటోంది. ఇటీవల విడుదలైన బాబు బాగా బిజీ చిత్రంలో ఉన్న ముగ్గురు హీరోయిన్లలో మిస్తీ చక్రవర్తి ఒకరు.
 
ముద్దు ముద్దుగా క్యూట్‌గర్ల్‌గా కనిపించే బెంగాలీ పాప మిస్తీ చక్రవర్తి తొలిసినిమా 'చిన్నదాన నీకోసం'తో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కేవలం గ్లామర్‌కే పరిమితం అయిందన్న అపవాదు మూటకట్టుకున్న మిస్తీ బాలీవుడ్‌కి వెళ్ళిపోయింది. దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్‌ తరువాత ఓ అడల్ట్‌ సినిమా బాబు బాగా బిజీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 
ఈ గ్యాప్‌పై ఆమె స్పందిస్తూ... తెలుగులో నా మొదటి సినిమా తర్వాత బాలీవుడ్‌, బెంగాలీ సినిమాలు పూర్తి చేయవలసి వచ్చింది. దాంతో ఇక్కడ అవకాశాలు వచ్చినా చేయలేకపోయాను. ఇక నుంచి తెలుగులో ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను.
 
'బాబు బాగా బిజీ' మాతృక 'హంటర్'‌లు వేర్వేరన్నారు. హంటర్ చిత్ర ప్రభావం నామీద ఉండకూడదనే చూడలేదు. కానీ తెలుగు దగ్గరకి వచ్చేసరికి చాలా మార్పులు చేశారు. ఇక్కడి నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు జరిగాయి. ఈ విషయం సినిమా చూసిన వారికి ఇట్టే తెలిసిపోతుంది.
 
తెలుగులో ఆయన సినిమాలు చూశాను. తెర మీద ఎంత అమాయకంగా కనిపిస్తారో బయట కూడా అంతే అమాయకంగా కనిపిస్తారు. మంచి మనిషి. చక్కగా మాట్లాడతారు. తాను నవ్వకుండా ఎదుటివారిని నవ్వించడంలో దిట్ట. షూటింగ్ మొత్తం బాగా ఎంజాయ్‌ చేశాం. షూటింగ్‌ ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేదని అనిపించిందని చెప్పుకొచ్చింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హాఫ్ గర్ల్ ఫ్రెండ్ కోసం ఎదురుచూపు... ఆమె అతడికి అలా వుంటుందట...(video)

ట్విట్టర్ ట్రెండింగ్‌లో దుమ్మురేపుతున్న బాలీవుడ్ చిత్రం ట్రెయిలర్ హాఫ్ గర్ల్ ఫ్రెండ్. ఈ ...

news

'బాహుబలి 2' వసూళ్లు రూ.1500 కోట్లే... నష్టాలు భర్తీ కావొచ్చు : నిర్మాత దేవినేని ప్రసాద్

బాహుబలి 2 చిత్రం కనకవర్షం కురిపిస్తోంది. కానీ, ఈ చిత్ర వసూళ్లపై ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ...

news

''బాహుబలి''కి గాలం వేస్తున్న కమలం.. నో.. నో అంటోన్న ప్రభాస్..?

''బాహుబలి 2'' వసూళ్ళు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటి వరకూ వెయ్యి ...

news

రజనీ వ్యక్తిత్వం విశిష్టమైనది.. ఇప్పటికీ ఆ పూరి గుడిసె ఎందుకుంటుందో తెలుసా?

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులను కలుస్తున్నారు. వారిలో సెల్ఫీ దిగేందుకు సోమవారం నుంచి ...

Widgets Magazine