రోజా హీరోయిన్‌గా తెలుగు సినిమా - దర్శకుడెవరో తెలుసా...?

మంగళవారం, 3 అక్టోబరు 2017 (15:15 IST)

ఎమ్మెల్యే రోజా. ఒకప్పుడు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత అప్పుడప్పుడు ఒకటో, రెండో సినిమాలు చేసుకుంటూ అలా ఉండిపోయారు. బుల్లితెరపై మాత్రం రోజాకు తిరుగులేదు. జబర్దస్త్ కార్యక్రమంలో రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. హీరోయిన్‌గా కాకుండా తల్లి, అక్క ఇలా క్యారెక్టర్లను చేస్తోంది రోజా. 
roja
 
అయితే రోజా హీరోయిన్‌గా ఆర్.నారాయణమూర్తి త్వరలో ఒక సినిమాను తీస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను వివరిస్తూ ఈ సినిమా ఉండబోతుంది. ఇప్పటికే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న రోజా ఈ సినిమాలో నటించేందుకు ఉత్సాహం చూపుతోందట. ఆర్.నారాయణమూర్తి గతంలో ఎన్నో సినిమాలను తీశారు. ప్రజా సమస్యలను కళ్ళకు కట్టేలా ఆయన తీసిన సినిమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాంటి దర్శకుడే ఇప్పుడు రోజాను హీరోయిన్‌గా చేస్తూ సినిమా తీస్తుండటం తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
 
నారాయణమూర్తి ఇప్పటికే కథను కూడా సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తోంది. సినిమా సాధారణంగా రెండున్నర గంటసేపు ఉంటుంది. కానీ ఈ సినిమా రెండు గంటల నిడివి మాత్రమే ఉంటుంది. కొంతమంది రాజకీయ నేతలను ఈ సినిమాల్లో నటించాలని నారాయణమూర్తే స్వయంగా కోరుతున్నారు.



దీనిపై మరింత చదవండి :  
Tollywood Mla Roja R Narayana Murti

Loading comments ...

తెలుగు సినిమా

news

సమంత - నాగ చైతన్య పెళ్లికి బ్రేకులు?

టాలీవుడ్ హీరోయిన్ సమంత, హీరో నాగ చైతన్యల ప్రేమ వివాహం ఈనెల ఆరో తేదీన అంగరంగ వైభవంగా ...

news

నానితో గొడవకు దిగిన సాయిపల్లవి.. ఎందుకు?

సక్సెస్ ఫుల్ హీరో, నేచురల్ స్టార్ నాని తాజాగా సాయిపల్లవితో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి ...

news

''రేణూ దేశాయ్'' తమ్ముడు ఎవరో తెలుసా? ఫోటో చూడండి..

నీ తోనే డ్యాన్స్ షోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ ...

news

ప్రకృతిని ప్రేమిస్తానంటున్న ఫిదా హీరోయిన్.. నానితో వార్!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన చిత్రం "ఫిదా". ఈ సూపర్ డూపర్ హిట్ ...