Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ ముగ్గురితో నాగార్జున వందో సినిమా.. బంగార్రాజుగా కనిపించనున్న మన్మథుడు

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (11:07 IST)

Widgets Magazine
nagarjuna-ramyakrishna

టాలీవుడ్‌లో బాలయ్య వందో సినిమా.. మెగాస్టార్ 150వ సినిమా ఫీవర్‌కు తెరపడింది. ప్రస్తుతం నాగార్జున వందో సినిమా గురించి టాక్ మొదలైంది. కానీ ఈ సినిమా ఇప్పటికిప్పుడు తెరకెక్కే  ఛాన్స్ లేదంటున్నారు సినీ పండితులు. కుమారుల పెండ్లి పనుల్లో బిజీగా ఉన్న నాగార్జున వాస్తవానికి వంద సినిమాలకు చేరువ కాలేదు. కానీ కామియో రోల్స్ వగైరా కలుపుకుంటే వందకు దగ్గరవుతాయి. 
 
నాగార్జునకు ఈ విషయంలో అంత ఆసక్తి లేకున్నా, అభిమానులు మాత్రం వందో సినిమా ఓ మైల్ స్టోన్ కావాలని నాగ్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఫ్యాన్స్ కోరిక మేరకు వందో సినిమా చేయాలని నాగ్ డిసైడైపోయాడట. సినిమా కథ అయితే రెడీగా లేదు కానీ, క్యారెక్టర్ మాత్రం బంగార్రాజు అని నాగ్ ఫిక్సయిపోయాడట. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో బంగార్రాజు క్యారెక్టర్ ఎంత హిట్ అనేది అందరికీ తెలిసిందే. 
 
అందుకే బంగార్రాజు క్యారెక్టర్‌ను సెంట్రల్ పాయింట్‌గా తీసుకుని, మాంచి కథ రెడీ చేయమని ఒకరిద్దరు డైరక్టర్లకు సూచించాడట. అంతేగాకుండా ఆ సినిమాలో అఖిల్, చైతూ కూడా నటించేందుకు వీలుగా మంచి క్యారెక్టర్లను సృష్టించమని నాగ్ దర్శకుడికి తెలిపాడట. అమల కూడా ఈ సినిమాలో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ లోగా రాజుగారి గది 2, చందుమొండేటి సినిమాలు పూర్తి చేసుకోవాలని నాగార్జున డిసైడైపోయాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సినిమాగా "అతడు అడవిని జయించాడు" నవల

ప్రముఖ తెలుగు రచయిత డా.కేశవరెడ్డి గారి నవల అతడు అడవిని జయించాడు ప్రపంచవ్యాప్త సినిమా ...

news

అడివి శేష్ హీరోగా 'చ‌దురంగ వేట్టై'ను తెలుగులో రీమేక్

త‌మిళంలో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం మూట‌గ‌ట్టుకున్న ...

news

కీర్తి సురేష్‌కు కలిసిరాని భైరవ.. షూటింగ్‌కు ముందు రిహార్సల్.. గ్లామర్ రోల్స్‌కు ఓకే!

నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్ తాజాగా నాని సరసన 'నేను లోకల్‌' చిత్రంలో నటించింది. ఈ సినిమా ...

news

దాసరికి పవన్ పరామర్శ... ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన చంద్రబాబు

సినీ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణ రావుని హీరో పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ...

Widgets Magazine