Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మెగాస్టార్ అయితే నాకేంటి.. రూ.4 కోట్లు ఇవ్వాల్సిందే... నయనతార

సోమవారం, 24 జులై 2017 (14:36 IST)

Widgets Magazine

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నటించేందుకు రూ.4 కోట్లు ఇవ్వాల్సిందేనని, దానికంటే ఒక్క పైసా తగ్గినా తాను అంగీకరించే ప్రసక్తే లేదని తనను సంప్రదించిన వారి వద్ద మలయాళ నటి నయనతార కుండబద్ధలు కొట్టినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
nayanathara
 
ఇటు టాలీవుడ్‌లోనేకాకుండా అంటు కోలీవుడ్, శాండల్‌వుడ్, మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న నటి నయనతార. ఈ క్రేజీ హీరోయిన్ కొంత విరామం తర్వాత మళ్లీ తెలుగు చిత్రాలపై దృష్టిసారించింది. ఇటీవల బాలకృష్ణ చిత్రానికి గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చిన నయన ఈ సినిమాతో పాటు చిరంజీవి నటించనున్న చిత్రాన్ని కూడా అంగీకరించింది. 
 
అయితే ఈ చిత్రానికి దాదాపు రూ.4 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు సమాచారం. ప్రతి సినిమాకు రెండు నుంచి రూ.2.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్న నయనతార 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'కి మాత్రం ఏకంగా నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇక్కడ ఇమేజ్‌తో పని లేదనీ, రెమ్యునరేషన్ ముఖ్యమని తనను సంప్రదించిన వారివద్ద ఆమె వ్యాఖ్యానించినట్టు వినికిడి. 
 
కాగా, ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు, హీరో రాంచరణ్ తన సొంత బ్యానెర్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా మలయాళ, హిందీ భాషల్లో అనువాద రూపంలో విడుదల చేయనున్నారని, ఆ కారణంగానే నాలుగు భాషలకు కలిపి నయనతార నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వోగ్ ఫోటోషూట్... ఐరినా షయక్ టాప్‌లెస్... లబ్ డబ్

హాలీవుడ్ నటి ఐరినా షయక్ పేరు చెబితే హీటెక్కిపోతారు ఆమె అభిమానులు. అలాంటి ఆ హాట్ నటి వోగ్ ...

news

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌తో నటి మైథిలి మజా... ప్రైవేట్ ఫోటో లీక్...

మలయాళ నటి మైథిలితో ఏకాంతంగా గడిపిన ఫోటోను ఆమె మాజీ ప్రియుడు లీక్ చేశాడు. ఈ ఫోటో మలయాళ ...

news

ఆమె పెద్ద అందగత్తె కాదే... కానీ సాయిపల్లవిలో ఏదో వుంది... అందుకే...

సాయి పల్లవి. గత నాలుగురోజుల ముందువరకు ఈ పేరు అస్సలు తెలుగు ప్రేక్షకులకు తెలియదు. కానీ ...

news

డ్రగ్స్ కేసు... చార్మీకి దడ పుడుతోందా? హైకోర్టును ఆశ్రయించిన నటి...

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు దడ పుట్టిస్తోంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్, శ్యామ్ కె ...

Widgets Magazine