శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 జూన్ 2017 (11:37 IST)

నా పేరు సూర్యలో హీరోయిన్‌గా నివేదా థామస్.. 2018 సంక్రాంతికి రిలీజ్

'నా పేరు సూర్య' సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్న సంగతి తెలిసిందే. డీజే రిలీజ్‌కు ముందే ‘నా పేరు సూర్య’ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ సినిమాలో హీరోయిన్ కోసం వేట ప్రారం

'నా పేరు సూర్య' సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్న సంగతి తెలిసిందే. డీజే రిలీజ్‌కు ముందే ‘నా పేరు సూర్య’ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ సినిమాలో హీరోయిన్ కోసం వేట ప్రారంభించాడు. ఈ ప్రాజెక్టులో హీరోయిన్‌గా కన్నడ నటి రష్మికను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే చిత్రయూనిట్ రష్మికకు బదులు మరో హీరోయిన్‌ను వెతికే పనిలో పడిందని టాలీవుడ్ వర్గాల భోగట్టా. 
 
అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రంలో హీరోయిన్‌గా నటించే విషయంపై ఇప్పటికే నిర్మాతలు నివేధాథామస్‌ను కూడా సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న నా పేరు సూర్య సినిమాకు బాలీవుడ్ కంపోజర్స్ విశాల్-శేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2018 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది.