Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నయనతారకు బ్లాక్ మనీ కష్టాలా.. ఒక సినిమాకు రూ.3కోట్లు.. వైట్ చేస్తేనే ఛాన్స్.. నిర్మాతలు షాక్..?

శుక్రవారం, 2 డిశెంబరు 2016 (13:17 IST)

Widgets Magazine

అందాల ముద్దుగుమ్మ నయనతార ప్రస్తుతం దక్షిణాది హీరోయిన్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. అందంతో పాటు మంచి అభినయం కలిగిన నయన్‌తో నటించేందుకు యువ హీరోలు సీనియర్ హీరోలు పోటీ పడుతున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని డిమాండ్ పరంగా పారితోషికాన్ని నయన్ పెంచేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్క చిత్రానికి నయనతార మూడు కోట్లకు తక్కువ తీసుకోవట్లేదు.
 
అయితే పెద్ద నోట్ల రద్దుతో నయనతారకు కష్టాలు తప్పట్లేదు. ఒక్కో చిత్రానికి మూడు కోట్లను తీసుకుంటున్న ఈ అమ్మడికి అన్ని పెద్ద నోట్లే చేరుతున్నాయి. ఇంత మొత్తంలో పుచ్చుకుంటుంది అంటే అది బ్లాక్‌ మనీ కిందికే వస్తుంది. దాంతో ఈ బ్లాక్‌ మనీని వైట్‌ చేసుకోవడానికి నయన్‌ చాలా తెలివిగా ప్రయత్నాలు చేస్తోంది. తన బ్లాక్‌ మనీని వైట్‌ చేస్తేనే అవకాశం ఇస్తానంటోంది.
 
అంతేకాకుండా తనకు ముట్టే మొత్తాన్ని కూడా కొత్త నోట్లే కావాలని డిమాండ్‌ చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మొత్తంలో కొత్త నోట్లు దొరకడం నిర్మాతలకు తలకు మంచిన భారం అవుతుంది. ఇంకా కొందరు నిర్మాతలైతే నయన్‌తో తిప్పలు తప్పట్లేదని.. ఆమెను పక్కనబెట్టి వేరే హీరోయిన్ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే నిర్మాతలు మాత్రం ఐటీకి సమాచారం ఇచ్చేసి.. అమ్మడిని ఇరికించేయాలనుకుంటున్నారు. మరి నయనతార గుర్రుగా ఉన్న నిర్మాతల దాడిని ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రీదేవికి చిర్రెత్తుకొచ్చిందట.. లిప్ లాక్ ఒకరితో కౌగిలింత మరొకరితో.. జాహ్నవి ఎవర్ని ప్రేమిస్తున్నట్లు?

అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ బాయ్‌ఫ్రెండ్స్ వ్యవహారంలో ఎక్కువగా వార్తల్లో ...

news

సాక్షిచౌదరికి ''ఆక్సిజన్'' ఇస్తున్న గోపిచంద్.. స్పెషల్ సాంగ్‌లో చిందులు..

హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ...

news

ఏ దిల్ హై ముష్కిల్‌తో హీటెక్కించిన ఐశ్వర్యారాయ్.. బుల్లితెరపై మెరవనుందట..

ఏ దిల్ హై ముష్కిల్ చిత్రంలో ఐశ్వ‌ర్యారాయ్ రణ్‌బీర్‌తో రొమాన్స్ పండించిన సంగతి తెలిసిందే. ...

news

పెళ్ళి చూపులు హీరో చాలా ఓవర్ చేస్తున్నాడా? పారితోషికం బాగా పెంచేశాడట..

ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్ళి చూపులు సినిమాల్లో నటించిన యువ హీరో విజయదేవరకొండపై టాలీవుడ్‌లో ...

Widgets Magazine