Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ముంబైలో సాహో షూటింగ్ త్వరలో స్టార్ట్.... అటు ప్రభాస్ పెళ్లికి కూడా సంబంధం ఫిక్స్

హైదరాబాద్, సోమవారం, 29 మే 2017 (04:07 IST)

Widgets Magazine

'బాహుబలి' రెండు పార్టులకోసం దాదాపు ఐదేళ్ల సమయాన్ని వెచ్చించిన ప్రభాస్.. ఇప్పుడు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందే 'సాహో' కోసం కేవలం ఆరు నెలలు కేటాయించనున్నాడట... ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ను.. ఇతర నటీనటులను ఫైనలైజ్ చేసే పనిలో ఉంది 'సాహో' టీమ్. 'బాహుబలి'లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు చేసిన ప్రభాస్ ఇప్పుడు 'సాహో' కోసం కూడా యాక్షన్ పార్ట్ ను అదరగొట్టనున్నాడట... వచ్చే నెలలో 'సాహో'లో ఫస్ట్ ఫైట్‌ను రెయిన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించనున్నారట. 
prabhas
 
'బాహుబలి' ఘన విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న ప్రభాస్.. ప్రస్తుతం అమెరికాలో హాలిడే మూడ్‌లో ఉన్నాడు.. వచ్చేనెలలో యు.ఎస్. నుంచి రాగానే 'సాహో' షూటింగ్ స్టార్ట్ అయిపోతుందని సమాచారం... ఈ షూటింగ్‌ను భారీ ఫైట్ సీక్వెన్స్‌తో మొదలుపెట్టనున్నారని, 'మిర్చి' స్టైల్ లో రెయిన్ ఎఫెక్ట్ లో 'సాహో' ఫైట్‌ను ముంబై వీధుల్లో భారీ లెవెల్‌లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
 
ఇటీవల సౌత్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఆన్‌లైన్ ఓటింగ్‌లో ఫస్ట్ ప్లేస్ కొట్టేసిన ప్రభాస్.. 'బాహుబలి' పూర్తైన తర్వాత కంపల్సరీ పెళ్లి చేసుకుంటానని ఫ్యాన్స్‌కు మాటిచ్చాడు.. ఆ మాట ప్రకారం ప్రభాస్ కుటుంబం సంబంధాలు చూస్తోందట... తమ సామాజిక వర్గానికే చెందిన ఓ సిమెంట్ కంపెనీకి చెందిన బిజినెస్ టైకూన్ మనవరాలితో ప్రభాస్ పెళ్లి దాదాపు ఖాయం అయిందంటున్నారు... మరి ఇదే నిజమైతే 'బాహుబలి' ఫ్యాన్స్‌కు పండగే కావచ్చు కానీ ప్రభాస్-అనుష్క పెళ్లి గురించి కలలు కంటున్న కోట్లమంది అభిమానులకు పిడుగుపాటే మరి.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దేవసేనకు భాగమతి చివరి సినిమానా? పెళ్లి వార్తలు నిజమేనా?

దర్శకుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలిలో కత్తి చేతబట్టి దేవసేన పాత్రలో ఒదిగిపోయింది. ...

news

స్వాములకు రాజకీయాలు అవసరమా?: యాంకర్ సుమ సూటి ప్రశ్న

స్వాములకు రాజకీయాలు అవసరమా? అంటూ పరిపూర్ణానంద స్వామిని టీవీ యాంకర్ సూటిగా ప్రశ్నించింది. ...

news

చలపాయ్ వ్యాఖ్యలను ఆరోజు ఒక్క మీడియా ప్రశ్నించలేదు ఎందుకని: నటి హేమ

సీనియర్ నటుడు చలపతిరావు బాబాయ్ చేసిన కామెంట్స్‌పై సినీ నటి హేమ మరోమారు స్పందించారు. ...

news

టీవీల్లో బూతు ప్రోగ్రాముల్ని ప్రసారం చేస్తున్నారు : సినీ న‌టి క‌విత

టీవీల్లో వస్తున్న ప్రోగ్రాములపై సినీ నటి కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 'జబ‌ర్దస్త్' ...

Widgets Magazine