గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శనివారం, 25 జూన్ 2016 (12:53 IST)

పూటుగా ఒళ్లు మరిచేలా తాగి.. నడిరోడ్డుపై రచ్చచేసిన నాయకి

చెన్నై బ్యూటీ త్రిషకు మద్యం సేవించే అలవాటు ఉన్నట్టు కోలీవుడ్, టాలీవుడ్ మీడియాలో జోరుగానే ప్రచారం సాగుతోంది. దీన్ని నిజం చేసేలా త్రిష తాజాగా వ్యాఖ్యలు కూడా ఉండటం గమనార్హం.

చెన్నై బ్యూటీ త్రిషకు మద్యం సేవించే అలవాటు ఉన్నట్టు కోలీవుడ్, టాలీవుడ్ మీడియాలో జోరుగానే ప్రచారం సాగుతోంది. దీన్ని నిజం చేసేలా త్రిష తాజాగా వ్యాఖ్యలు కూడా ఉండటం గమనార్హం. తాను మద్యం సేవించినట్టుగా సన్నివేశాలు ఉండే చిత్రాలన్నీ సూపర్ డూపర్‌హిట్లు అయ్యాయని... అందువల్ల తాను నటించే చిత్రాల్లో కూడా దర్శకులు మద్యం సన్నివేశాలు ఉండేలా సీన్లు క్రియేట్ చేస్తున్నారని ఈ చెన్నయ్ చిన్నది చెప్పిన విషయం తెలిసిందే. 
 
అయితే ఈ భామ ఇప్పుడు మళ్లీ ఒళ్లు మరిచేలా పీకలదాకా తాగి రోడ్డంతా వీరవిహారం చేస్తూ నానా హంగామా సృష్టించింది. అటుగా వెళ్తున్న ఓ యువకుడు ఆ తతంగమంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది మరింత రచ్చ రచ్చ అయ్యింది త్రిష వ్యవహారం. అయితే ఈ వీడియో రాత్రి పూట తీసింది కావడంతో అంతా చీకటిగానే ఉంది. ఇప్పటికే చాలాసార్లు ఈ అమ్మడు ఇలాంటి విషయాల్లో చిక్కి నవ్వుల పాలైంది. త్రిష తాగుడు గోల ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఇలాగే కొనసాగిస్తే.. కెరీర్ మళ్ళీ గాడిలో పడే ప్రమాదముందని, ఆలోపే అమ్మడు కోలుకుంటే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ భామ నటించిన నాయకి సెన్సార్ పూర్తిచేసుకొని రిలీజ్‌కి సిద్దంగా ఉంది.