శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: బుధవారం, 29 ఏప్రియల్ 2015 (15:37 IST)

పవర్ స్టార్ సరసన అనుష్క నటిస్తుందా...? పవన్ డీప్ గా అధ్యయనం చేస్తున్నాడట?!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గోపాల గోపాల చిత్రం తర్వాత ఎందుకనో బాగా గెడ్డం పెంచేసి ఫార్మ్ హైసులోనే ఉంటున్నట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ప్రత్యేకించి ఓ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గెడ్డం చేసుకునే తీరిక కూడా లేకుండా తెగ ఆలోచన చేస్తున్నారనీ, ఆ సినిమా టాలీవుడ్ రికార్డులన్నిటినీ బద్ధలు కొట్టి... మున్ముందు మరే సినిమా కూడా ఆ రికార్డును అధిగమించలేని స్థాయిలో ఉండాలని పవన్ లోతుగా ఆ సినిమా స్క్రిప్టుపై అధ్యయనం చేస్తున్నారని అంటున్నారు. 

 
అందువల్ల ఆయన పెరిగిన గెడ్డం గురించి పట్టించుకోలేదని చెప్పుకుంటున్నారు. కాగా ఈ స్క్రిప్టు కూడా మరో గెడ్డం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కోబలి అంటున్నారు. ఈ కోబలి చిత్రంలో హీరోయిన్ గా అనుష్కను ఎంపిక చేసినట్లు చెప్పుకుంటున్నారు. అనుష్క కూడా ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తమ్మీద గెడ్డాలతో ఉన్న హీరోదర్శకుడు, కత్తి, డాలు పట్టుకోవడంలో మంచి తర్ఫీదు పొందిన అనుష్క కాంబినేషన్లో ఒకవేళ కోబలి వస్తే ఎలా ఉంటుందో చూడాల్సిందే మరి.