Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమ్మాయిని లేపుకొస్తే భరత్‌కు పెళ్లి చేశా... నేను ఆశ్రయం కోల్పోయా: పోసాని

మంగళవారం, 27 జూన్ 2017 (20:36 IST)

Widgets Magazine
posani

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు వివాహంపై టాలీవుడ్ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భరత్ ఓ అమ్మాయిని లేపుకొస్తే తానే దగ్గరుండి తానే దగ్గరుండి వివాహం జరిపించా.. ఆ తర్వాత ప్రముఖ రచయిత పరుచూరి బ్రదర్స్ వద్ద తాను ఆశ్రయం కోల్పోయినట్టు చెప్పారు. ఇపుడు భరత్ మృతి చెందిన నేపథ్యంలో ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది.
 
సినీ కెరీర్‌ ఆరంభంలో పరుచూరి బ్రదర్స్‌ వద్ద అసిస్టెంట్‌గా పోసాని పనిచేశారు. అప్పుడు పరుచూరి బ్రదర్స్‌ ఆఫీస్‌లోనే ఓ రూమ్‌లో ఉండేవారు. ఆసమయంలో హైదరాబాద్‌ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చిన భరత్‌.. పోసాని రూమ్‌కు ఆశ్రయం కోసం రాగా, ఆయన సమ్మతించి ఆశ్రయం కల్పించాడు. అయితే ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చిన విషయం తెలుసుకున్న పరుచూరి బ్రదర్స్.. తమ వద్ద అసిస్టెంట్‌గా పని చేస్తున్న పోసానిని ఇంటి నుంచి బయటకు పంపేశారు.
 
ఈ సందర్భంగా భరత్‌ పెళ్లి గురించి మాట్లాడుతూ.. భరత్‌ హైదరాబాద్‌లో ఓ డబ్బున్న అమ్మాయిని ప్రేమించాడని, అతడి పెళ్లి తామే చేశామని చెప్పారు పోసాని. అయితే వారు ప్రస్తుతం విడిపోయారని ఆ ఇంటర్వ్యూలో పోసాని చెప్పుకొచ్చారు. కాగా, భరత్ రాజును కడసారి చూసేందుకు సైతం హీరో రవితేజ, ఆయన తల్లి రాజ్యలక్ష్మి రాలేదు. ఇది కూడా ఇపుడు చర్చనీయాంశంగా మారింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆన్‌లైన్‌లో నాని ''నిన్ను కోరి'' ఆడియో జ్యూక్ బాక్స్ రిలీజ్ (video)

నేచుర‌ల్ స్టార్ నాని తాజా చిత్రం నిన్ను కోరి. జూలై 7న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి ...

news

ఏడాదిన్నర పాటు మహాభారతం చదువుతున్నాను: షారూక్ ఖాన్

మహాభారతంపై త్వరలో సినిమా రానుంది. మలయాళ ఇండస్ట్రీ ఇప్పటికే పనులు మొదలెట్టేసింది. మలయాళ ...

news

'తొలిప్రేమ' దర్శకుడితో మెగాహీరో?

'తొలిప్రేమ'... పవన్ కళ్యాణ్, భూమిక నటించిన చిత్రం. సూపర్ డూపర్ హిట్ కావడమే కాకుండా పవన్ ...

news

బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ - మహేష్ వార్...

బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, ప్రిన్స్ మహేష్ బాబులు నువ్వానేనా అంటూ తలపడనున్నారు. ...

Widgets Magazine