Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జాతీయ హీరో అనుకుంటే బాలీవుడ్‌లో అతిథి పాత్రా.. ప్రభాస్ ఏమైపోతాడో..

హైదరాబాద్, బుధవారం, 28 జూన్ 2017 (06:47 IST)

Widgets Magazine
prabhas

బాహుబలి 2 సినిమా విడుదల కాగానే ఆ చిత్ర హీరో ప్రభాస్ అంతర్జాతీయ స్టార్ డమ్‌ సాధించేశాడు. అమరేంద్ర బాహుబలి పాత్రతో కోట్లాది భారతీయుల హృదయాల్లో నిలిచిపోయిన ప్రభాస్‌కు బాలీవుడ్ బ్రహ్మరథం పట్టింది. ప్రభాస్‌తో డైరెక్టు సినిమాలు నిర్మించేందుకు దర్శక-నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు పలువురు బాలీవుడ్ దర్శకులు చర్చలు జరుపుతున్నారు.  కానీ హిందీ తెరపై ఓ స్ట్రైట్‌ సినిమాలో హీరోగా కనిపించే ముందు ప్రభాస్ గెస్ట్‌ రోల్‌లో అలరించనున్నారని భోగట్టా.
 
హిందీ చిత్రం ‘ఖామోషీ’లో ప్రభాస్‌ గెస్ట్‌ రోల్‌ చేయనున్నారనే వార్త షికారు చేస్తోంది. ప్రభుదేవా, తమన్నా జంటగా దర్శకుడు చక్రి తోలేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళ ‘కొలైయుదిర్‌ కాలమ్‌’కి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో కథను మలుపు తిప్పే పాత్ర ఒకటి ఉందట. ఆ పాత్ర కోసం ప్రభాస్‌ని సంప్రదించగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. 
 
ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘పౌర్ణమి’లో హీరోగానూ, తానే దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘యాక్షన్‌ జాక్సన్‌’లోనూ ప్రభాస్‌ ఓ సాంగ్‌లో కనిపించారు. ఇక, తమన్నాతోనూ ప్రభాస్‌ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కోసం గెస్ట్‌ రోల్‌కి ఒప్పుకున్నారనే ఊహాగానాలు ఉన్నాయి.
 
కానీ ఇలా ప్రారంభ చిత్రంలోనే గెస్ట్ రోల్ లో కనిపిస్తే ప్రేక్షకులు అంచనాలు తారుమారవుతాయేమోనని ప్రభాస్ అభిమానులు కలవరపడుతున్నారు. ఈ వార్తను ఇంకా ఎవరూ నిర్ధారించలేదు కాబట్టి అసలు వార్తకోసం వేచి ఉండాల్సిందే.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ప్రేమ కంటే అవసరాన్నే నమ్ముతా.. దానికి పెళ్లి అవసరమా. . సల్మాన్ ప్రశ్న

ట్యూబ్‌లైట్‌’ చిత్రం ప్రమోషన్‌లో పాల్గొన్న సల్మాన్‌.. ‘పెళ్లితో డబ్బు వృథా’ అంటూ చేసిన ...

news

అమ్మాయిని లేపుకొస్తే భరత్‌కు పెళ్లి చేశా... నేను ఆశ్రయం కోల్పోయా: పోసాని

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు వివాహంపై టాలీవుడ్ రచయిత, ...

news

ఆన్‌లైన్‌లో నాని ''నిన్ను కోరి'' ఆడియో జ్యూక్ బాక్స్ రిలీజ్ (video)

నేచుర‌ల్ స్టార్ నాని తాజా చిత్రం నిన్ను కోరి. జూలై 7న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి ...

news

ఏడాదిన్నర పాటు మహాభారతం చదువుతున్నాను: షారూక్ ఖాన్

మహాభారతంపై త్వరలో సినిమా రానుంది. మలయాళ ఇండస్ట్రీ ఇప్పటికే పనులు మొదలెట్టేసింది. మలయాళ ...

Widgets Magazine