గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : గురువారం, 23 జూన్ 2016 (10:05 IST)

కెరీర్‌లో తొలిసారి పోలీసాఫీసర్‌గా ప్రభాస్.. 2016 జూలైలో షూటింగ్ ప్రారంభం అవుతుందా?

'బాహుబలి'తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరో ప్రభాస్ 'బాహుబలి ది కంక్లూజన్' పూర్తిచేసి సుజిత్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ఇక ఆ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పొలీస్ ఆఫీస

'బాహుబలి'తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరో ప్రభాస్ 'బాహుబలి ది కంక్లూజన్' పూర్తిచేసి సుజిత్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ఇక ఆ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పొలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడట. యువి క్రియేషన్స్ పతాకంపై నిర్మాణమయ్యే ఈ చిత్రం కోసం దర్శక నిర్మాతలు స్క్రిప్ట్‌ని రెడీ చేసే పనిలో నిమగ్నమైయున్నారు. 
 
మాస్ హీరోలంతా పోలీస్ పాత్ర‌ని దాదాపు వేసేశారు. అయితే.. ప్ర‌భాస్ మాత్రం త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క‌సారి కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించలేదు. ఆరడుగుల అందగాడు... సిక్స్ ప్యాక్ దేహం ఉండే ప్ర‌భాస్‌కి పోలీస్ పాత్ర‌లు బాగా నప్పుతాయి. కానీ... ఎందుకనో అలాంటి క‌థ‌లు చేయలేదు. అయితే ఇప్పుడు త‌న కెరీర్‌లోనే తొలిసారి పోలీస్‌గా క‌నిపించ‌బోతున్నాడు.
 
ప్రభాస్ ఇప్పటి వరకు విభిన్న పాత్రలు చేశాడుగాని పొలీస్ ఆఫీసర్‌గా మాత్రం నటించలేదు... అందుకే ప్రభాస్‌కు ఈ పాత్ర వెరైటీగా ఉంటుందని అలాగే పొలీస్ పాత్రకు మరింత వన్నె తెచ్చేలా ఈ పాత్ర ఉంటుందని దర్శకుడు అంటున్నారు. ఈ సినిమా క్రైమ్ కామెడీ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మ‌ని టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. కాగా 2016 జూలైలో ఈ సినిమా మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయని సినీపండితులు అంటున్నారు.