'అజ్ఞాతవాసి'ని చూసి 'సాహో' జాగ్రత్తపడుతున్నాడు... ఎందుకో తెలుసా?

గురువారం, 11 జనవరి 2018 (14:04 IST)

అజ్ఞాతవాసి చిత్రం ఫ్రెంచ్ చిత్రానికి కాపీ అని టాలీవుడ్ ఇండస్ట్రీలో బీభత్సంగా ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాపీ కొట్టారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు... ఈ చిత్రం రీమేక్ హక్కులను టీ-సిరీస్ కలిగి వున్నదనీ, దానితో టి.సిరీస్ కు ఏకంగా రూ. 20 కోట్లు ఇచ్చి సమస్యను పరిష్కారం చేసుకున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 
pawan kalyan-prabhas
 
ఇప్పుడు ప్రభాస్ తాజా చిత్రం సాహో కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నట్లు భోగట్టా. ఈ చిత్ర దర్శకుడు సుజిత్ కూడా ఓ హాలీవుడ్ చిత్రం నుంచి కొన్ని యాక్షన్ సీన్లు కాపీ కొట్టారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో అజ్ఞాతవాసి చిత్రానికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయో అలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా ముందే జాగ్రత్తపడాలని సాహో చిత్ర బృందం చర్యలు తీసుకుంటోందట. 
 
కాపీ కొట్టిన సన్నివేశాలను మక్కీకిమక్కీగా లేకుండా రీషూట్ చేయడమో లేదంటే సదరు చిత్ర నిర్మాతను కలిసి మాట్లాడటమో చేయాలని ఆలోచన చేస్తున్నారట. మరి ఇది నిజమా కాదా అన్నది చూడాల్సి వుంది.దీనిపై మరింత చదవండి :  
Prabhas Alerts Agnathavasi Saaho Team Copy Issues Pawan Kalyan

Loading comments ...

తెలుగు సినిమా

news

చిరంజీవి చిన్నల్లుడు హీరోయిన్ ఎవరో తెలుసా?

చిరంజీవి చిన్నల్లుడికి జోడీగా మేఘాఆకాశ్ నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ...

news

ఇందిరా గాంధీగా కనిపించనున్న బాలీవుడ్ నటి

భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ మూవీ లేదా వెబ్ సిరీస్‌గా ...

news

ఎయిర్‌టెల్‌పై సెటైర్‌లు విసిరిన అక్కినేని వారసుడు

టాలీవుడ్ హీరో 'సుమంత్' ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌పై అసహనం వ్యక్తం చేసారు. కాల్ ...

news

''యాపిల్ సిడర్ వెనిగర్'' తాగండి అంటున్న సమంత.. ఎందుకు?

అందరినీ ఆకట్టుకునే అందం సమంత సొంతం. మధ్య తరగతి కుటుంబం నుంచి హీరోయిన్‌ స్థాయికి ఎదిగిన ...