Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''బాహుబలి''కి గాలం వేస్తున్న కమలం.. నో.. నో అంటోన్న ప్రభాస్..?

మంగళవారం, 16 మే 2017 (10:34 IST)

Widgets Magazine
baahubali 2 movie still

''బాహుబలి 2'' వసూళ్ళు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటి వరకూ వెయ్యి కోట్లు వసూలు చేసిందని రాబోయే రోజుల్లో అది 1500 కోట్లు వసూలు చేయడం ఖాయమని నిర్మాత దేవినేని ప్రసాద్ అంటున్నారు. అయితే బాహుబలి ది బిగినింగ్ ద్వారా దాదాపు రూ.70 కోట్లు నష్టం వచ్చిందని చెప్పిన అదే నోటితో బాహుబలి 2 ద్వారా లాభాలొచ్చాయని చెప్పారు. 
 
ఈ నేపథ్యంలో బాహుబలి సినిమాలో నటించిన నటీనటులకు మంచి క్రేజ్ లభించింది. ముఖ్యంగా ప్రభాస్‌కు ఈ సినిమా ద్వారా భారీ ఆఫర్లు వస్తున్నాయి. అంతేగాకుండా పొలిటికల్ ఆఫర్లు కూడా వస్తున్నాయని టాక్. ప్రభాస్ ఇమేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఓ జాతీయ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రభాస్‌తో ఎన్నికల ప్రచారం చేయిస్తే, గెలుపు ఖాయమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 
ప్రభాస్‌ను ఎలాగైనా రాజకీయాల్లో తీసుకురావాలనే లక్ష్యంతో సదరు పార్టీ వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. అయితే, తన రాజకీయ ప్రచారంపై ప్రభాస్ ఇంతవరకూ నోరు విప్పలేదని తెలుస్తోంది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ప్రస్తుతం బీజేపీలో ఉండటంతో ప్రభాస్‌కు గాలం వేయాలని కమలం పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకు ప్రభాస్ మాత్రం దాటవేస్తున్నట్లు తెలుస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రజనీ వ్యక్తిత్వం విశిష్టమైనది.. ఇప్పటికీ ఆ పూరి గుడిసె ఎందుకుంటుందో తెలుసా?

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులను కలుస్తున్నారు. వారిలో సెల్ఫీ దిగేందుకు సోమవారం నుంచి ...

news

తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీకి టైమ్ రాలేదు : కమల్ హాసన్

తమిళనాడులో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి విశ్వనటుడు ...

news

చైనాలో దంగల్ సునామీ.. టాప్ వన్ సినిమాగా అమీర్ ఖాన్ రికార్డు.. బాహుబలి-2కి నిజమైన పోటీ

చైనాలో కలెక్షన్ల వరద సృష్టిస్తున్న అమీర్ ఖాన్ చిత్రం దంగల్ హాలీవుడ్ తాజా చిత్రాలను కూడా ...

news

రూ. 432 కోట్లు సాధించిన బాహుబలి-2 హిందీ వెర్షన్.. రూ. 1500 కోట్లకు చేరువగా ప్రపంచవ్యాప్త కలెక్షన్లు

దేశీయ, ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద బాహుబలి ది కంక్లూజన్ ప్రభంజనం కొనసాగిస్తోంది. ...

Widgets Magazine