Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిరంజీవి నన్ను రమ్మన్నారు... ప్రగ్యా జైస్వాల్

మంగళవారం, 5 డిశెంబరు 2017 (13:51 IST)

Widgets Magazine

నేను లా చదివాను. న్యాయవాది అవ్వాలనుకున్నాను. ప్రాక్టీస్ కూడా చేశాను. నాకు సినిమాలు అస్సలు ఇష్టం లేదు. నేను లా ప్రాక్టీస్‌లో ఉంటే మా బంధువు నువ్వు సినిమాల్లో ట్రై చెయ్, చాలా బాగా చేయగలవని సలహా ఇచ్చాడు. అంతే... మా ఇంట్లో అప్పటినుంచి నన్ను సినిమాల్లోకి వెళ్ళమని ఒత్తిడి చేయడం ఎక్కువైంది. ఇంట్లో వారి ఒత్తిడి తట్టుకోలేక మొదటగా మోడల్‌గా జీవితాన్ని ప్రారంభించా. పుణేలో మోడల్‌గా స్టార్టయి అలాఅలా సినిమాల్లోకి వచ్చాయి. నేను నటించిన సినిమాలు ఎక్కువగా తెలుగులోనే ఉన్నాయి. 
Pragya Jaiswal
 
ఒక్క తెలుగు అక్షరం కూడా రాదు. కానీ తెలుగు సినిమాల్లో మాత్రం నటించేస్తున్నా. ఇది నాకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. దర్శకులు నాకు భాష రాకున్నా హావభావాలు ఎలా చేయాలో చెప్పిస్తున్నారు. దాంతోనే మొత్తం సినిమా చేసేస్తున్నా. జయ జానకి నాయక సినిమా మంచి విజయాన్ని అందించింది. చాలా సంతోషంగా ఉంది. గతంలో నటించిన సినిమాల కన్నా ఇప్పుడు నటించే సినిమాలే నాకు మంచి గుర్తింపు ఇస్తుందని ఆశాభావంతో ఉన్నా. 
 
చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి, ఆచారి అమెరికా యాత్ర సినిమాలు ప్రస్తుతం చేస్తున్నా. ఈ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నా. ఈ రెండు సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు దర్శకులు నాకు. ఈ సినిమాలు రిలీజ్ అయితే నాకు మంచి పేరు కూడా వస్తుంది. సైరా నరసింహారెడ్డి సినిమాలో నా నటన చూశారు చిరంజీవి. నువ్వు బాగా చేస్తున్నావు. బాగుంది. ఖాళీగా ఉన్నప్పుడు మా ఇంటికి రా. మా కుటుంబ సభ్యులను పరిచయం చేస్తానని చిరంజీవి చెప్పారు. అంత గొప్ప స్టార్ నన్ను ఇంటికి పిలవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. చాలా సంతోషం. నాకు తెలుగు భాష నేర్చుకోవాలని ఉంది. త్వరలోనే తెలుగు భాషను నేర్చుకోగలనన్న నమ్మకం నాకుంది అంటోంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అజ్ఞాతవాసి సాంగ్ మేకింగ్ వీడియో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ...

news

అర్జున్ రెడ్డికే లిప్ కిస్ ఇచ్చాను.. విజయ్ దేవరకొండకు కాదు: షాలినీ పాండే

అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే లిప్ లాక్‌పై స్పందించింది. తాజాగా 100% లవ్ తమిళ ...

news

జబర్దస్త్ హాస్యంపై విరుచుకుపడ్డ రాజేంద్రప్రసాద్

కామెడీ అంటే ఆరోగ్యవంతంగా ఉండాలి. జంధ్యాల, రేలంగి నరసింహారావు, బాపు, సింగీతం శ్రీనివాసరావు ...

news

రిలీజ్‌కు ముందే 'అజ్ఞాతవాసి' రికార్డు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ...

Widgets Magazine