శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By PNR
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (16:17 IST)

ఇచ్చిన మాట కోసం రూ. కోట్ల ఆఫర్లు తిరస్కరించిన ప్రియాంకా చోప్రా!

సాధారణంగా సినిమావాళ్లు అంటేనే డబ్బు మనుషులనే పేరుంది. కానీ, బాలీవుడ్‌ హీరోయిన్ ప్రియాంకా చోప్రా మాత్రం అందుకు మినహాయింపు. ఎందుకంటే ముందు ఇచ్చిన మాట కోసం కోట్లాది రూపాయల ఆఫర్లను ఆమె తృణప్రాయంగా వద్దని చెప్పేస్తున్నారు. 
 
ఇటీవల ఓ రియాలిటీ షోకి చెందిన నిర్వాహకులు ప్రియాంకను సంప్రదించారు. తమ రియాలిటీ షోను నడిపిస్తే అందుకు పది కోట్ల రూపాయలను ఇస్తామని ప్రతిపాదించారు. అయితే, ప్రస్తుతం తాను చేయలేనంటూ ఇంతటి భారీ ఆఫర్‌ను ఆమె సున్నితంగా తిరస్కరించారు. 
 
ఆ తర్వాత అదే మొత్తం ఇస్తామంటూ మరికొందరు రియాలిటీ షోల నిర్వాహకులు ఆమెని కలిసినా, ఇదే సమాధానం ఇచ్చిందట. అందుకు కారణం వివిధ సినిమాకి సంబంధించిన డేట్స్‌తో ఆమె డైరీ ఖాళీ లేకపోవడమేననే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేవైనా ఈ స్థాయి ఆఫర్స్‌ని ప్రియాంక అంగీకరించకపోవడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.