Widgets Magazine

నాలుగే పదాలతో బండ్ల గణేష్ ట్వీట్- పవన్‌తో సినిమా చేస్తారా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర కామెంట్లు చేశారు. నాలుగంటే నాలుగే పదాలతో ఒకే లైన్లో చేసిన ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఎప్పుడూ పవన్ తనకు దేవుడితో

selvi| Last Updated: శనివారం, 13 జనవరి 2018 (17:43 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర కామెంట్లు చేశారు. నాలుగంటే నాలుగే పదాలతో ఒకే లైన్లో చేసిన ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఎప్పుడూ పవన్ తనకు దేవుడితో సమానం అంటూ చెప్పుకొచ్చిన బండ్ల గణేష్.. తాజా ట్వీట్‌ను బట్టి చూస్తే పవన్ కల్యాణ్‌తో బండ్ల గణేష్‌తో సినిమా తీసేందుకు సిద్ధమైపోయినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

ఇంతకీ బండ్ల గణేశ్ ఆ ట్వీట్‌లో ఏమన్నారంటే.."నా బాస్‌ని నేను గౌరవిస్తా" అంటూ "నమస్కారం" చేసే ఎమోజీని పోస్ట్ చేశారు. దీంతో, పాటు పవన్ కల్యాణ్ ఫొటోనూ జతపరిచారు. కాగా, బండ్ల గణేశ్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే విషయమై నెటిజన్లు ఆలోచనలో పడ్డారు.

అయితే సినీ పండితులు మాత్రం పవన్ చేసే తదుపరి సినిమాకు నిర్మాత బండ్ల గణేషేనని అంచనా వేశారు. అందుకే ఈ ఫోటోను బండ్ల గణేష్ పోస్ట్ చేశారని.. సినిమాలో పవన్ స్టిల్‌నే బండ్ల గణేష్ ట్విట్టర్లో పెట్టారని అంచనా వేస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :