శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Modified: శనివారం, 13 డిశెంబరు 2014 (13:20 IST)

రవితేజతో రొమాన్స్ చేయనున్న రాశిఖన్నా!

రాశిఖన్నా ఎవరనుకుంటున్నారా? అదేనండి.. 'ఊహలు గుసగుసలాడే' సినిమా ద్వారా పేరు తెచ్చుకున్న ఈ సుందరి ఇప్పటికే గోపీచంద్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ జత కట్టేందుకు రెడీ అవుతోంది. ఒక్క హిట్ వస్తేనే ఆఫర్లిచ్చేందుకు నిర్మాతలు క్యూ కడుతున్న తరుణంలో రాశిఖన్నా కూడా ఇదే విధంగానే రవితేజతో నటించే ఛాన్సును కొట్టేసింది. 
 
సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ నటించే 'బెంగాల్ టైగర్' సినిమాలో రెండో కథానాయికగా రాశి ఎంపికైంది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా తమన్నా ఎంపికైన సంగతి తెలిసిందే.