Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

100 ఎకరాలు కొన్న రాజమౌళి... ఫ్యామిలీకి గిఫ్టుగా ఫామ్ హౌస్...

సోమవారం, 5 జూన్ 2017 (12:07 IST)

Widgets Magazine

బాహుబలి చిత్రంతో తెలుగు సినీ చరిత్రలో రికార్డు సృష్టించిన దర్శకుడు రాజమౌళి 100 ఎకరాలను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ 100 ఎకరాలు హైదరాబాదుకు దూరంగా వున్న దొనకొండలో కొన్నట్లు తెలుస్తోంది.  ఇందులో ఓ చక్కటి ఫామ్ హౌస్ కట్టుకుని సేద తీరాలని రాజమౌళి ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఈ కల ఇప్పటిది కాదనీ, ఎన్నో ఏళ్ల నుంచి ఇలా తను అనుకున్నట్లు 100 ఎకరాల్లో మంచి ఫామ్ హౌస్ కట్టుకుని అక్కడి వాతావరణంలో కాలం గడపాలనుకునేవారట. 
rajamouli-farmhouse
 
బాహుబలి చిత్రంతో ఆ కల నెరవేరబోతోంది. తను కొనుగోలు చేసిన ఈ పొలంలో మామిడి, సపోటా చెట్లు వున్నట్లు తెలుస్తోంది. ఆ చెట్లను అలాగే వుంచేసి పొలంలో ఓ పక్కన వున్న కొండ ప్రాంతం అంచున ఫామ్ హౌసును నిర్మించాలని రాజమౌళి అనుకుంటున్నట్లు సమాచారం. 
 
ఈ నిర్మాణం కోసం చక్కని డిజైన్ ఇవ్వాల్సిందిగా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్‌కు చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు రాజమౌళితో పాటు కీరవాణి, రాజమౌళి స్నేహితుడు సాయి కొర్రపాటిలు కూడా ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారట. మొత్తమ్మీద రాజమౌళి ఫామ్ హౌస్ ఆలోచనతో దొనకొండ ప్రాంతం ప్రాముఖ్యతను సంతరించుకున్నది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సంఘమిత్ర రేసులో అనుష్క, నయనతార: ఎవరికి ఆ ఛాన్స్ దక్కుతుందో?

సంఘమిత్రగా శ్రుతిహాసన్ కనిపిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఆ సినిమా నుంచి డేట్స్ ...

news

''లై''కోసం నితిన్ బిజీ బిజీ.. పవన్ నిర్మాత.. అమెరికాలో షూటింగ్

పవన్ కల్యాణ్‌‌కు నితిన్‌ అభిమాని అనే విషయం తెలిసింది. పవన్-నితిన్‌కి మధ్య మంచి ...

news

రారండోయ్ రూ.35కోట్ల రికార్డు.. సమంత ఇక హీరోయిన్‌గా వెండితెరపై కనిపించదా?

అక్కినేని నాగ చైతన్య నటించిన సినిమాల్లో తక్కువ రోజుల్లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన ...

news

అమ్మ-సమంత కనీసం రోజుకు గంటసేపైనా ఫోన్లు మాట్లాడుకుంటారు.. నాన్నను కలిస్తే?

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఎప్పుడైనా గొడవ పడితే ముందుగా తన తల్లికే ఫోన్ చేసి కంప్లైంట్ ...

Widgets Magazine