గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: శుక్రవారం, 14 ఆగస్టు 2015 (21:17 IST)

మళ్లీ 'మెరుపు' అంటున్నాడట... రామ్‌ చరణ్‌కు ఏమైంది...?!!!

ఇదే విషయాన్ని ఆయన సన్నిహితులు అడుగుతున్నారు. గత కొన్నిరోజులుగా రామ్‌చరణ్‌ నటిస్తున్న తాజా చిత్రం కోసం టైటిల్స్‌పై మల్లగుల్లాలు పడుతున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కత్తి లాంటి టైటిల్‌ చూడాలని సూచించారట. కానీ దానికి రామ్‌ చరణ్‌.. గతంలో తమిళ దర్శకుడు ధరణితో ఓ సినిమా చేస్తున్నప్పుడు 'మెరుపు' అనే పేరు పెట్టారు. 
 
ఆ చిత్రానికి ముందు 'ఆరెంజ్‌' డిజాస్టర్‌ కావడంతో కొన్ని కారణాలవల్ల మెరుపు సినిమాకు బ్రేక్‌ పడింది. ఇక ఆ చిత్రం గురించి అందరూ మర్చిపోయారు. ఇప్పుడు శ్రీను వైట్ల సినిమాకు మెరుపు కరెక్ట్‌గా వుంటుందని చరణ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసరాల్లో జరుగుతోంది. ఈ చిత్రంపై ఈ నెల 22న తన తండ్రి షష్టిపూర్తి సందర్భంగా ప్రకటించనున్నట్లు సమాచారం.