Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

"బాహుబలి 2"ను తెగ చూస్తున్నారు.. ఆందోళన చేయండి : కన్నడవాసులకు రాంగోపాల్ వర్మ పిలుపు

శుక్రవారం, 19 మే 2017 (14:56 IST)

Widgets Magazine

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు మరోమారు ట్వీట్ చేశారు. ఈ దఫా కర్నాటక రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేశారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి 2' చిత్రం గత నెల 28వ తేదీన విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రం విడుదలకు ముందు కొన్ని కన్నడ సంస్థలు.. 'బాహుబలి 2' చిత్రం విడుదల కాకుండా అడ్డుకుంటామని ప్రకటించారు. ఆ తర్వాత ఈ సమస్య సద్దుమణిపోయిన తర్వాత 'బాహుబలి 2' చిత్రం విడుదలైంది. 
 
ఒకవైపు.. ‘బాహుబలి-2’ చిత్రాన్ని ఆకాశానికెత్తేస్తూ ట్వీట్ల‌పై ట్వీట్లు చేస్తున్న ఈయన.. ఇపుడు ఈ సినిమా విడుద‌ల‌ను అడ్డుకుంటామ‌ని ముందుగా ప్ర‌క‌టించిన క‌న్న‌డిగుల‌పై తాజాగా మండిప‌డ్డాడు. తెలుగు సినిమా 'బాహుబలి-2' క‌ర్నాట‌క‌లో అక్క‌డి సినిమాల కంటే పెద్ద విజ‌యాన్ని సాధించింద‌ని, కన్నడిగులు చేసే డబ్బింగ్‌ సినిమాల రికార్డులను ఓ తెలుగు సినిమా చెరిపేసిందని వ్యాఖ్యానించారు. 
 
దీంతో క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కు కావాల్సింది ఓ మంచి సినిమా మాత్రమేనని అర్థమవుతోందన్నారు. తమ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తమ భాషలో వచ్చిన సినిమా కంటే తెలుగులో వచ్చిన బాహుబలినే ఎక్కువ సార్లు చూస్తున్నందుకు కర్ణాటక వాసులంతా ఆందోళన చేపట్టాలంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ కళ్యాణ్ బాటలో హృతిక్ రోషన్... మాజీ భార్య కోసం అలా చేస్తున్నాడు...

సినిమావాళ్ల ప్రేమలు, పెళ్లిళ్లు, విడిపోవడాలు... మళ్లీ కలిసిపోవడాలు చూస్తుంటే... సమాజం ...

news

#1500CroreBaahubali : రిమార్కబుల్ మైల్‌స్టోన్.. థ్యాంక్స్‌ టు ఎవ్రివన్... బాహుబలి టీమ్

సరిగ్గా మూడంటే మూడు వారాల్లో రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి: ది కన్ క్లూజన్' ...

news

ఆన్‌లైన్‌లో ‘భళిభళిరా భళి..’ పాట, భారత్‌లో ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో టాప్ (మీరూ చూడండి)

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి గత నెల 28వ తేదీన విడుదలైన చిత్రం బాహుబలి 2. ఈ చిత్రం ...

news

సుప్రియ ప్లీజ్ అది చెయ్...! ఏంటది..?

సుప్రియ.. ఎవరీమె. ఏంటి చెయ్యమంటున్నారు అనుకుంటున్నారా.. తెలుగు సినీపరిశ్రమలో ఈ పేరు ...

Widgets Magazine