Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్టీఆర్ బయోపిక్... రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో..... నిజమా?

సోమవారం, 3 జులై 2017 (13:53 IST)

Widgets Magazine

స్వర్గీయ ఎన్టీ.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ నిర్మితంకానుంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ నిర్మించి నటించనున్నారు. అయితే, ఇలాంటి ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారనే దానిపై టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడి జీవిత విశేషాలను కళ్లకు కట్టినట్లు చూపించగలిగే సత్తా ఉన్న డైరెక్టర్ ఎవరా అని నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారు. 
 
ఈనేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్‌పై ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాకు వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బాలయ్యతో ‘పైసా వసూల్’ మూవీ చేస్తున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇటీవల ఫేస్‌బుక్ లైవ్‌లో చెప్పిన మాట ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
 
బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో పాటు ఫేస్‌బుక్ లైవ్‌కు వచ్చిన పూరీ జగన్నాథ్.. ‘వర్మ-బాలయ్య’ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవల ‘రక్తచరిత్ర, వంగవీటి’ వంటి సినిమాలు తీసిన వర్మ.. మనసుపెట్టి ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తే ఆ సినిమా రికార్డు సృష్టించడం ఖాయమని సినీ జనాలు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై నందమూరి అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాకా ఫోబియా... వాడి ప్రాణాలు తీయడానికే ఆ లారీ ఆగివుంది... ఏడ్చేసిన రవితేజ

రవితేజ తన సోదరుడు భరత్ దుర్మరణం పాలవడంపై మొన్నటివరకూ మీడియా ముందుకు రాలేదు. చివరికి ...

news

ప్రియుడితో విదేశాలకు పారిపోయిన బాలీవుడ్ ప్రముఖ హీరో కుమార్తె!

బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్. చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ స్థానం ...

news

హీరోహీరోయిన్లు... 'బాహుబలి డెసెర్ట్స్‌'ను లొట్టలేసుకుని ఎలా లాగిస్తున్నోరో చూడండి (Video)

అబుదాబీ హోటల్‌లో 'బాహుబలి డెసెర్ట్స్' తయారు చేశారు. దీన్ని టాలీవుడ్‌కు చెందిన ...

news

కాజల్‌ను కౌగిలిలో నలిపేసిన బ్రహ్మీ... 'ఎం.ఎల్‌.ఏ.'లో సెట్స్‌లో సందడి

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంను తన కౌగిలిలో బంధించి ...

Widgets Magazine