గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 19 ఆగస్టు 2014 (15:43 IST)

రానా ద్విపాత్రాభియనం... ఫిలింసిటీలో సెట్ కాల్చేశారు...

దగ్గుబాటి రానా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి'. ఈ సినిమాలో రానా రెండు పాత్రల్ని పోషిస్తున్నాడని తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మొదటి పార్ట్‌ పూర్తికావచ్చింది. రెండు భాగాలుగా ఈ చిత్రం వుంటోంది. ఇటీవలే ఫిలిం సిటీలో వేసిన సెట్‌లో మొత్తం వర్క్‌ పూర్తయింది. దాన్ని ఇటీవలే సెంటిమెంట్‌గా కాల్చేశారట. 
 
ఇందులో రానా తండ్రిగా నాజర్‌ నటిస్తున్నాడు. ప్రభాస్‌, అనుష్క నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే పెద్ద క్రేజ్‌ ఏర్పడింది. ఇందులో తన పాత్రతో పాటు రానా పాత్ర అద్భుతంగా వుంటుందని నాజర్‌ చెబుతున్నాడు. గతంలో రాజమౌళి చిత్రాలన్నీ సినిమా రిలీజ్‌ అయ్యేవరకు బయటకు పొక్కేవికాదు. కానీ ఈ చిత్రంలో కాస్త మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.