గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : సోమవారం, 27 జూన్ 2016 (13:06 IST)

పందిపిల్లతో రవిబాబు కొత్త సినిమా.. గ్రాఫిక్స్ కోసం రూ.2 కోట్లు

ఈ తరం దర్శకుల్లో రవిబాబు రూటే సెపరేటు. ఆసక్తికరమైన కథాంశాలతో ''అల్లరి'', ''అనసూయ'', ''సోగ్గాడు'', ''నచ్చావులే'', ''అవును'' వంటి సినిమాలు తీసిన సినిమాలు చేయడమే కాకుండా, వైవిధ్యంగా ఆ చిత్రాలకు ప్రచారం చ

ఈ తరం దర్శకుల్లో రవిబాబు రూటే సెపరేటు. ఆసక్తికరమైన కథాంశాలతో ''అల్లరి'', ''అనసూయ'', ''సోగ్గాడు'', ''నచ్చావులే'', ''అవును'' వంటి సినిమాలు తీసిన సినిమాలు చేయడమే కాకుండా, వైవిధ్యంగా ఆ చిత్రాలకు ప్రచారం చేసుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్ననటుడు రవిబాబు. రవిబాబు తీసిన సినిమాలో హాలీవుడ్ రేంజ్‌ని మించిపోయిన చిత్రం 'అవును'. వెరైటీ కథలతో సినిమాలు తీస్తూ దర్శకుడిగా కెరీర్ కొనసాగిస్తున్న రవిబాబు ప్రస్తుతం మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమా తీయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
 
దర్శకధీరుడు రాజమౌళి గతంలో ''ఈగ''తో సినిమా తీసి సూపర్ సక్సెస్ కొట్టాడు. అదే స్ఫూర్తితో రవిబాబు కూడా మరో జంతువును లీడ్ రోల్‌గా పెట్టి తన సినిమాను తీయాలనుకుంటున్నాడు. అయితే ఈ సినిమాలో ఏ ఈగనో, బొద్దింకనో కాదు ఏకంగా ఓ పందిపిల్లనే లీడ్‌గా పెట్టి సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో పందిపిల్ల చుట్టూ కథ సాగుతుందట. అభిషేక్, నబా హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ రవిబాబు చేస్తున్న ఈ సినిమాలో ఎక్కువగా గ్రాఫిక్స్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పంది పిల్లను గ్రాఫిక్స్లో క్రియేట్ చేయటం కోసం దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. 
 
ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమాకు స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. ఈ చిత్రం కోసం ఏనిమాట్రానిక్స్ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకుని దానికి దేశీయ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి ఓ రకమైన ఏనిమేషన్‌తో క్రియేట్ చేస్తున్నాడు రవిబాబు. ఎలుకలు, బొద్దింకలు, డైనోసార్లు, కోతులతో చాలామంది సినిమాలు తీస్తే నేను మాత్రం ఓ పంది పిల్లతో చిత్రం ఎందుకు చేయకూడదని అనుకున్నాడేమో.. ఇలా పందిపిల్లతో సినిమా తీస్తున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. మరి ఈగ లాగా ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.