Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జరగాల్సిన డ్యామేజ్ జరిగింది... ఇపుడు చెప్పేందుకు ఏమీలేదు : భరత్ మరణంపై హీరో రవితేజ

ఆదివారం, 2 జులై 2017 (11:47 IST)

Widgets Magazine
raviteja

తన సోదరుడు భర్త మరణం, అంత్యక్రియల సమయంలో తమ ఫ్యామిలీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందనీ, ఇకపై దీని గురించి మాట్లాడాల్సింది, చెప్పాల్సిందేమీ లేదని హీరో రవితేజ అన్నారు. ఆయన తాజాగా ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తమ్ముడు భరత్ కారు ప్రమాదంలో మరణించిన వేళ, కనీసం అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదన్న నిందను మోయాల్సి రావడం తనకెంతో బాధను కలిగించిందన్నారు. తాము ఏ పరిస్థితిలో ఉన్నామో కూడా చూడకుండా, సామాజిక మాధ్యమాల్లో హిట్స్ కోసం రాద్ధాంతం చేశారని, ఎంతమాత్రమూ ఆలోచించకుండా నిందలు వేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
తమ్ముడి కర్మకాండలు అపరిచితులతో చేయించలేదని, తన తల్లి సోదరి భర్తతోనే చేయించామని, ఆయన ఎవరో తెలుసుకోకుండానే, భరత్‌ను అనాథను చేశామని చెబుతూ తన కుటుంబాన్ని అవమానించారని వాపోయాడు. ఇక భరత్ మరణించిన రోజు షూటింగ్‌లో ఎంతో మంది డేట్స్ ఉన్నాయని, ఇది కోట్ల వ్యాపారమని, ఒక్కరోజు తేడా జరిగినా నిర్మాత నష్టపోతాడన్న ఆలోచనతోనే బాధను మనసులోనే దిగమింగుకుని షూటింగ్‌కు వెళ్లినట్టు తన చర్యను సమర్థించుకున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రోజూ తాగొచ్చి చావబాదుతున్నాడు : నటుడిపై భార్య ఫిర్యాదు

తమిళ బుల్లితెర, సినీ నటుడిపై అతని భార్య చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతి రోజూ ...

news

తాప్సీతో డేటింగ్ కాదు కానీ ఆ బంధం మాత్రం చాలా బలంగా వుంది... బాలీవుడ్ హీరో

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించి గ్లామర్ ఆరబోసిన తాప్సి పన్ను ఇప్పుడు బాలీవుడ్ ...

news

రోమియో జూలియట్ మ్యూజికల్ డ్రామాలో వరలక్ష్మీ శరత్ కుమార్

సినీ నటుడు శరత్ కుమార్, విశాల్ గర్ల్ ఫ్రెండ్‌గా పిలవబడుతున్న వరలక్ష్మీ రూటు మార్చింది. ...

news

జబర్ధస్త్‌లో ఇక నాగబాబు కనిపించరా?

జబర్ధస్త్ ప్రోగ్రామ్‌ హైప్ ఎంతగా వుందో అందరికీ తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌లోని స్కిట్లు, ...

Widgets Magazine