గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : మంగళవారం, 24 మే 2016 (12:26 IST)

బిగ్ బాస్ 7లో ఎంట్రీ ఇచ్చిన టాప్ మోడల్ నన్‌గా మారిపోయింది.. ఎందుకో?!

బిగ్ బాస్ 7 సిరీస్‌లో పాల్గొన్న సోఫియా హయత్‌ని ఎవరైనా మర్చిపోగలరా... బిగ్ బాస్ సిరీస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటరైన ఈ టాప్ మోడల్.. ఇప్పుడు నన్‌గా (పెళ్లి చేసుకోకుండా) మారిపోయింది. ఏమైందో ఏమోగాని తన అందచందాలను సైతం లెక్కచేయకుండా తన అసలైన రూపం ఇదీ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నన్‌గా మారిపోయి కుర్రకారుకే కాకుండా యావత్ ప్రపంచానికే ఊహించని షాక్ నిచ్చింది. 
 
అప్పట్లో అర్మాన్ కోహ్లీతో గొడవ పెట్టుకుని షో మధ్యలోనే వెళ్ళిపోయి సంచలనం సృష్టించింది. బ్రిటీష్ మోడల్ అయిన సోఫియా 2012లో ఈమె మాజీ బోయ్‌ఫ్రెండు రోహిత్ శర్మ 264 పరుగులు చేసినప్పుడు అతడికి బహుమతిగా తన నగ్న సెల్ఫీని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి దుమారం రేపింది. అప్పుడు అలా చేసినా, ఇప్పుడు నన్‌గా మారినా.. సోఫియా హయత్ ఏం చేసినా ఓ సంచలనమే. ఇప్పుడు తాను పూర్తిగా మారిపోయానని, తనను గయా సోఫియా మదర్ అని పిలవాలని అందరికి చెబుతోందట ఈ అమ్మడు.