గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (16:26 IST)

పవన్‌తో టచ్‌లో ఉన్నా.... రోజూ ఫోన్ లో మాట్లాడుతా... రేణూ దేశాయ్

పవన్ కళ్యాణ్ తో కొనాగుతున్న తన బంధం పై రేణు దేశాయ్ కొన్ని ఆసక్తికర విషయాలను ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఆ విషయాలేంటయా అంటే, ప్రతిరోజు పవన్ కళ్యాణ్ తో ఫోన్‌లో టచ్‌లో ఉంటోందట. అంతేకాదు... అనేక విషయాలపై తెగ మాట్లాడుకుంటామని కూడా చెప్పిన రేణూ ప్రధానంగా తమ ఇద్దరు పిల్లలైన అకిరా, ఆద్యల గురించి మాట్లాడుకుంటామంటూ చెప్పుకొచ్చింది. 
 
భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ తమ మద్ద మంచి స్నేహబంధం ఉందని అంటోంది. దాంపత్య బంధం విఫలమై విడాకులు తీసుకున్నప్పటికీ తను మాత్రం పవన్ కళ్యాణ్ ను చాలా గౌరవిస్తానని అంటోంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా పిల్లల గురించి, తన వ్యవహారాల గురించి సలహాలు ఇస్తుంటారట. కొసమెరుపు ఏంటంటే... గాసిప్స్ అస్సలు పట్టించుకోవద్దని పవన్ చెపుతుంటారట. మంచిదే కదా...!!