మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By CVR
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (17:40 IST)

రౌడీ ఫెలో హీరో సిక్స్ ప్యాక్ చేస్తాడట...!

రౌడీ ఫెలో సినిమా చూసిన త‌ర‌వాత కొందరు నారా రోహిత్ ఇంత‌ బొద్దుగా ఉన్నాడేంటి..? అనుకొన్నారు. ఇంత లావైతే... భ‌విష్యత్తు చాలా కష్టం అనే కామెంట్లూ వెలువడ్డాయి. ఇవి కాస్తా ఆ నోటా ఈ నోటా పాకి... రోహిత్ చెవికి చేరాయి. అందుకే... అర్జెంటుగా స్లిమ్ అయిపోవాల‌నే నిర్ణయానికొచ్చాడు. 
 
అంతేకాదు.. ప‌నిలో ప‌నిగా సిక్స్ ప్యాకూ చేస్తాడ‌ట‌. బాగాలావ‌య్యా అనే మాట‌లు వినిపించాయి... అందుకే బాగా సన్నబడాలని నిర్ణయించుకున్నాను. అందుకు సంబంధించి క‌స‌ర‌త్తులు కూడా మొద‌లెట్టేశానంటున్నాడీ కుర్రోడు. అయితే త్వరలోనే కొత్త రోహిత్‌ కనిపిస్తాడన్నమాట.