శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2016 (11:23 IST)

'సుల్తాన్' సెట్స్‌లో కన్నీరుకార్చిన సల్మాన్ ఖాన్.. ఎందుకు?

స్టార్ హీరోలకి సినిమాల్లో తప్ప రియల్ లైఫ్‌లో కన్నీళ్లు రావని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఈ విషయాన్ని అప్పుడప్పుడు అమీర్ ఖాన్ నిరూపిస్తుంటాడు. మొన్నటికి మొన్న సల్మాన్ ఖాన్ నటించిన ''భజరంగి భాయ్‌జాన్'' సినిమాని చూసి అమీర్ భావోద్వేకానికి గురైన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో కండల వీరుడు సల్మాన్ కూడా చేరిపోయాడు.
 
అవును.. ప్రస్తుతం ''సుల్తాన్'' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఓ సెంటిమెంట్ సాంగ్ కూడా పాడాడట. ఆ సాంగ్ రికార్డింగ్ అయిపోగానే నిజంగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయాడట సల్మాన్. ఆ సాంగ్‌లో అంతగా లీనమైన సల్మాన్‌కి కాసేపు మాటలు సైతం రాలేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సల్మాన్‌ని అంతగా ఏడిపించిన ఆ సాంగ్ ఎంటాని, ఎలా ఉంటుందన్న సందేహాలు అప్పుడే మొదలయ్యాయి. మరి ఆ సాంగ్‌లో ఎంత సెంటిమెంట్ ఉందో తెలుసుకోవాలంటే ఇంకొంత కాలం వేచి ఉండాల్సిందే.