శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: సోమవారం, 1 సెప్టెంబరు 2014 (12:59 IST)

సమంతకు అది వచ్చిందట... అందుకే మీడియా ముందుకు రానంది!

నటి సమంత మీడియా ముందుకు వస్తున్నట్లు ప్రకటించింది. ఆదివారంనాడు రెండుసార్లు టైమ్‌ మార్చి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడానికి కబురు పంపింది. 'రభస' చిత్రం గురించి అల్లుడు శీను చిత్రం గురించి ఏమి చెబుతోందనని అందరూ ఆతృతగా ఎదురుచూస్తుండగా... మళ్ళీ మూడోసారి సడెన్‌గా... నేను మీడియా ముందుకు రావడంలేదంటూ ట్వీట్‌ చేసింది. 
 
అందులో సారాంశం ఏమంటే.. తాను ఎడతెరిపి లేకుండా షూటింగ్‌లో పాల్గొనడం వల్ల తనకు వైరల్ ఫీవర్‌ వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తోంది. అందులో రెండు తమిళ చిత్రాలు కాగా, ఒకటి కన్నడ సినిమా. ఈమధ్య సమంత మాటిమాటికీ ఫీవర్ అంటోంది ఏంటో సంగతి మరి.