గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: గురువారం, 26 మార్చి 2015 (20:30 IST)

సమంత త్రిష బాటలోనే నడుస్తోందా..!!?

సమంత ఒక వ్యాపారితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నట్లు కోలీవుడ్‌లో సాగుతన్న హాటెస్ట్‌ న్యూస్‌. సాధారణంగా కథనాయికలు, కథానాయకులను లేదా ప్రముఖ వ్యాపారస్తులను, ప్రేమించి, పెళ్లి చేసుకోవడం ఎక్కువగా చూస్తుంటాం. నటి సమంత ప్రేమ వ్యవహారం కూడా అందుకు భిన్నం కాదని తెలుస్తోంది. ఈ చెన్నై చిన్నది నటుడు సిద్ధార్థ్‌తో కొంతకాలం ప్రేమ వ్యవహారం నడిపారు.

 
వీరి ప్రేమ పెళ్లి వరకు దారితీస్తుందనే ప్రచారం జరిగింది. అలాంటిది వారి మధ్య మనస్పర్థలు వచ్చి ప్రేమ పటాపంచలైంది. ఈ విషయాన్ని వీరిద్దరూ బహిరంగంనే ప్రకటించారు. కొంతకాలంగా నటనపైనే దృష్టి సారించిన సమంత తమిళంలో విక్రమ్‌, విజయ్‌, సూర్య అంటూ స్టార్‌  హీరోలతో నటిస్తున్నారు. అలాంటి సమంత తాజాగా మళ్లీ ప్రేమ వార్తల్లోకెక్కారు. 
 
ఈ బ్యూటీ ఇప్పుడు ఒక ప్రముఖ యువ వ్యాపారవేత్త ప్రేమలో పడ్డారన్నది టాక్‌ ఆఫ్‌ ఇండస్ట్రీగా మారింది. ఆ ప్రియుడు కూడా చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అట. ఇంతకుముందు నటి త్రిష కూడా ఒక టాలీవుడ్‌ నటుడితో ప్రేమ కలాపాలు సాగించారనే ప్రచారం జరిగింది. అలాంటిది ఆమె వ్యాపారవేత్త వరుణ్‌ మణియన్‌తో పెళ్లికి సిద్ధమయ్యారు. ఇప్పుడు సమంత త్రిష బాటలోనే  నడవనున్నారా? అన్నది వేచి చూడాల్సిందే.