బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: గురువారం, 31 జులై 2014 (15:11 IST)

సమంతకు విజయ్ రూ. 30 లక్షల కారు గిప్ట్..?

ఈమధ్య హీరోయిన్లకు గిఫ్టులు ఇచ్చేవారు ఎక్కువయిపోతున్నారు. ఆమధ్య అంజలికి ఖరీదైన కారును ఓ వ్యక్తి బహూకరించారంటూ టాలీవుడ్లో ప్రచారం జరిగింది. తాజాగా సమంతకు కూడా ఓ హీరో కారు కొనిచ్చాడంట. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, సమంతకి సూపర్ గిప్ట్ కొనిచ్చాడంట. 
 
విజయ్‌తో కలసి కత్తి చిత్రంలో నటిస్తున్న ఈ భామకు విజయ్ 30 లక్షల రూపాయలు విలువ చేసే కారును బహూకరించాడట. అంత ఖరీదైన కారును సమంతకు ఇవ్వడంపై కోలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య బంధం ఏదైనా గట్టిగా పడిందా అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏంటో విషయం...?