మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By PNR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (10:36 IST)

నేను సింగిల్‌ కాదు.. మేమిద్దరం ఎక్కడ కలుసుకున్నామంటే.. సమంత!

టాలీవుడ్ చుల్‌బులి సమంత ప్రేమలో పడిపోయింది. అది ఓ తమిళ హీరోతో. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది కూడా. తన ప్రేమ గురించి ఇకపై అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని కూడా చెప్పిందని తెలిపింది. అందుకే ఇపుడు తాను సింగిల్ కాదనీ, తనకంటూ ఓ తోడు ఉన్నాడంటూ బాహాటంగా చెపుతోంది. 
 
వాస్తవానికి ఈ కథానాయిక ప్రేమ పురాణంపై మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చాయి. అయినా అవేమీ నిజం కాదని ఖండిస్తూ వచ్చింది అమ్మడు. కానీ, అప్పట్లో తను చెప్పింది నిజంకాదని, అబ్బద్ధం చెప్పానని ఈ ముద్దుగుమ్మ చెప్పింది. తాజాగా ఓ టాక్ పాల్గొన్న ఈ చిన్నది ఈ విషయాన్ని వెల్లడించింది. 
 
ఈ క్రమంలో తనను ప్రశ్నిచగా.. "అవును, మొదట్లో నేను అలానే చెప్పాను. నా రిలేషన్‌షిప్ గురించి అడిగిన ప్రతిసారీ సింగిల్ అనే చెప్పాను. ఎందుకంటే తొలుత దానిపై అంత ఖచ్చితంగా లేను. కన్ఫర్మ్ అవడానికి చాలా సమయం పట్టింది. మేము ఎక్కడ కలుసుకున్నామో నాకు తెలుసు. కాబట్టి, ఇకపై అబ్బద్దం చెప్పాల్సిన అవసరంలేదని సమంతా చెపుతోంది. ఇంతకీ ఆ హీరో పేరు మాత్రం బయటకు వెల్లడించలేదు.