శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By IVR
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (19:34 IST)

సమంతకు నైజాం కావాలట... వామ్మో అన్న ప్రొడ్యూసర్...

బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్రాండ్ సక్సెస్ సాధించిన సినిమా ఇటీవల ఏంటయా అంటే క్వీన్ మూవీ అని చెప్పేస్తారు. ఇపుడా చిత్రం రీమేక్ హక్కుల్ని నిర్మాత, నటుడు త్యాగరాజన్ దక్కించుకున్నాడు. ఐతే ఈ రీమేక్ వ్యవహారానికి సమంతకు మధ్య లింకేమిటి అనుకుంటున్నారా...? అక్కడికే వస్తున్నా.
 
త్యాగరాజన్ ఈ చిత్రంలో నటింపజేయాలనుకుంటున్న హీరోయిన్ల లిస్టు వేసుకుని ఎవర్ని తీసుకోవాలా అని తెగ ఆలోచన చేస్తున్నారట. ఇందులో భాగంగా ఆ సినిమాలో పాత్రకు త్రిష అయితే సరిపోతుందేమోనని ఆమెతో సంప్రదింపులు చేస్తున్నాడట. ఐతే పనిలో పనిగా ఎవరో చెబితే సమంతను కూడా తీసుకోవచ్చేమోనని ఊరకే ఓ రాయి విసిరాడట. 
 
అంతే... సమంత చెప్పిన మాటకు త్యాగరాజన్ కళ్లు బైర్లు కమ్మాయట. విషయం ఏంటయా అంటే, ఈ చిత్రంలో నటించేందుకు తనకు ఎంతమాత్రం రెమ్యునరేషన్ అవసరం లేదని అందట సమంత. హుర్రా.. అని అనుకునేలోపే... బదులుగా తనకు నైజా ఏరియా ఇవ్వాలని చెప్పిందట. అంతే నిర్మాతకు నోట మాట రాలేదట. ఎందుకంటే నైజా ఏరియా రైట్స్ కావాలంటూ ఇప్పటికే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు రూ. 3 కోట్ల ఆఫర్ ఇచ్చారట. అంటే సమంత రెమ్యునరేషన్ రూ. 3 కోట్లా...? ఇపుడిదే టాలీవుడ్ హాట్ టాపిక్ మరి.