గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By CVR
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (11:41 IST)

సంగీత దర్శకుడి సరసన సమంత... సక్సెస్ కొడుతుందా?

టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న అందాల తార సమంత. పెద్ద హీరోల సరసన చేస్తూ టాప్ హీరోయిన్‌గా ఉన్న సమంత చిన్న గ్యాప్‌లో యంగ్ హీరో నితిన్‌తో ఓ సినిమా చేయడానికి రెడీ అయింది. ఈ క్రమంలోనే సమంత మరో యంగ్ హీరో సరసన చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్‌లో ఇటీవల హీరోగా మారి, దూసుకుపోతున్న ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్.
 
నూతన దర్శక ద్వయం గుణ-శంకర్‌లు 'బ్రూస్ లీ' పేరిట తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో జీవీ ప్రకాష్ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన హీరోయిన్‌గా సమంతను నటింపచేసేందుకు ట్రై చేస్తున్నారు. ఆమె కూడా ఈ ప్రాజక్టు పట్ల ఆసక్తి చూపుతున్నప్పటికీ, ఇంకా గ్రీన్ సిగ్నల్ మాత్రం ఇవ్వలేదు. 
 
ఆమె అంగీకరిస్తుందన్న ఆశతో దర్శక నిర్మాతలున్నారు. కాగా ఈ జంట కుదిరినట్లైతే మరో హిట్టు కొట్టడమే కాకుండా, తెలుగు తెరకు జీవీ పరిచయం అయినట్లు అవుతుందని, సినీ వర్గాలు భావిస్తున్నాయి.