గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: గురువారం, 30 అక్టోబరు 2014 (12:18 IST)

పవన్‌ 'గబ్బర్ సింగ్ 2' దర్శకత్వం సంపత్‌కేనట!

చిరంజీవి 150 చిత్రం కంటే పవన్‌ కళ్యాణ్ చిత్రాల గురించి పెద్ద చర్చ సాగుతుంది. గబ్బర్‌ సింగ్‌-2 చిత్రాన్ని తన మిత్రుడు శరద మరార్‌ నిర్మిస్తుండగా, ఆ చిత్రానికి దర్శకులు పలానా అని కొన్ని పేర్లు వచ్చాయి. ఆఖరికి పవన్‌ కళ్యాణే దర్శకత్వం చేస్తాడని వార్తలు కూడా విన్పించాయి. 
 
కానీ పవన్‌ డేట్స్‌ కోసం రెండేళ్లుగా ఎదరుచూస్తున్న సంపత్‌నందికే అవకాశాలు వున్నట్లు గట్టిగా వార్త విన్పిస్తోంది. రామ్‌ చరణ్‌తో రచ్చ చిత్రాన్ని ఇచ్చిన సంపత్‌నంది.. చిరు కుటుంటానికి బాగా తెలిసినవాడు. పవన్‌ అప్పట్లోనే సంపత్‌కు మాట ఇచ్చాడని తెలిసింది. 
 
అయితే మధ్యలో బాబీ అనే దర్శకుడు అదే... పవర్‌ చిత్ర దర్శకుడు పేరు కూడా విన్పిస్తుంది. కానీ తను మరలా రవితేజకు సినిమా చేసే పనిలో వున్నట్లు సమాచారం. ఏ విషయమూ కొద్దిరోజుల్లో తేలనుంది.