Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'బిగ్‌బాస్' నుంచి సంపూ వైదొలగడానికి కారణమిదే...

ఆదివారం, 30 జులై 2017 (11:49 IST)

Widgets Magazine
Sampoornesh Babu

ప్రముఖ టీవీ 'స్టార్ మా'లో ప్రసారమయ్యే బిగ్‌బాస్ షో నుంచి టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు అర్థాంతరంగా వైదొలిగాడు. ఇలా షో నుంచి బయటకురావడానికి అసలైన కారణాలు ఇపుడు వెలుగులోకి వచ్చాయి. 
 
నిజానికి ఈ షో కంటెస్టెంట్స్‌‌లో ఒకరైన సంపూర్ణేష్ బాబు నాలుగు గోడల మధ్య ఉండలేక, ఆ వాతావరణంలో ఇమడలేకే బయటికొచ్చినట్లు ప్రకటించారు. అయితే సంపూ ఈ షో నుంచి బయటకు రావడానికి అదొక్కటే కారణం కాదట. మిగతా కంటెస్టెంట్స్‌లో కొందరు సంపూతో హేళనగా మాట్లాడటం, అవమానించడం జరిగిందట.
 
సంపూ చేసిన సినిమాల్లో కామెడీ సీన్స్‌ను ప్రస్తావిస్తూ ఎగతాళి చేసేవారట. పైగా నీలాంటి కమెడియన్‌కు కూడా వరుస సినిమాలు రావడం ఆశ్చర్యంగా ఉందంటూ కొందరు సంపూర్ణేష్ బాబును తక్కువ చేసి మాట్లాడారట. నువ్వు చాలా లక్కీ అంటూ సంపూపై వ్యంగ్యాస్త్రాలు సంధించారట. 
 
ఈ పరిణామాలన్నీ అతనిని తీవ్రంగా బాధించాయట. అయితే ఏదేమైనా సంపూ షో నుంచి బయటికొచ్చే సమయంలో వ్యక్తం చేసిన భావోద్వేగాలు వీక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేసి రేటింగ్‌ పెరిగేలా చేశాయట. ఇక సూటిపోటి మాటలు భరించడం తన వల్ల కాక షో నుంచి బయటికొచ్చేసినట్లు టాక్. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

40 మందికి నోటీసులు.. పేర్లు వెల్లడించవద్దని బెదిరింపులు.. అకున్ కామెంట్స్

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ స్కామ్‌లో మరో 40 మందికి తెలంగాణ ఎక్సైజ్ శాఖ నోటీసులు ...

news

పని ఒత్తిడి నుంచి బయటపడాలంటే డ్రగ్స్ వాడాల్సిందే.. హీరోకు చెప్పిన దర్శకుడు...

షూటింగ్ సమయాల్లో పని ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఆ మాత్రం డ్రగ్స్ వాడకం తప్పదని ప్రముఖ ...

news

కథ డిమాండ్ చేస్తే ఎలాగైనా వాడుకోవచ్చంటున్న హీరోయిన్..

తెలుగు చిత్రపరిశ్రమలోకి ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రం ద్వారా అడుగుపెట్టిన రకుల్‌ ...

news

నదిలో పడిన సుకుమార్.. ప్రాణాలకు తెగించి కాపాడిన హీరో.. ఎవరు?

షూటింగ్ సమయాల్లో వివిధ రకాల ప్రమాదాలు చోటుచేసుకుంటుంటాయి. ఇలాంటి ప్రమాదాల్లో కొందరు ...

Widgets Magazine