శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : సోమవారం, 13 జూన్ 2016 (17:08 IST)

'ఉడ్తా పంజాబ్'కు ఏ సర్టిఫికేట్.. ముంబై హైకోర్టు జోక్యంతో

షాహిద్‌కపూర్, అలియా భట్, కరీనాకపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్తం 'ఉడ్తా పంజాబ్'. ఈ చిత్రం వివాదం ఎట్టకేలకు సుఖాతంగా ముగిసింది. 13 క‌ట్స్‌తో స‌రిపెట్ట‌డంతోపాటు సినిమాకు 'ఎ' స‌ర్టిఫికెట్ ఇచ్చింది. బోర్డులోని 9 మంది స‌భ్యులు సినిమా చూశార‌ని, చివ‌రికి 13 అభ్యంత‌ర‌క‌ర డైలాగ్స్‌ను క‌ట్ చేయ‌డంతోపాటు ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చామ‌ని బోర్డు అధ్య‌క్షుడు ప‌హ్లాజ్ నిహ్లానీ తెలిపారు. 
 
మాదక ద్రవ్యాలకు బానిసైన పంజాబ్‌కు చెందిన ఓ రాక్‌స్టార్ ఇతివృత్తంగా తీసిన ఈ సినిమాకు ధ్రువీకరణ పత్రం జారీకి సెన్సార్‌ బోర్డు ఏకంగా 89 కత్తెర్లు వేసింది. అయితే ఇందులో అసభ్యకర పదాలు ఎక్కువగా వాడారని, ప్రముఖుల పేర్లను సినిమాలో జంతువులకు పెట్టారని, సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పైగా చిత్ర టైటిల్ పంజాబ్ అనే పదాన్ని తొలగించాలని ఆదేశించింది. 
 
అయితే దీనిపై బాలీవుడ్ పరిశ్రమ ఒక్కటై... సెన్సార్‌బోర్డు తీరును ఖండించింది. సెన్సార్‌బోర్డు తీరును తప్పుబడుతూ చిత్ర సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ చేప్టటిన ముంబై హైకోర్టు... సెన్సార్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారించిన కోర్టు సినిమా చూసే ప్రేక్షలకు ఏది మంచో, చెడో ఎవరు నిర్ణయిస్తారు. 
 
సెన్సార్ బోర్డు కేవలం సినిమాలకు సర్టిఫికెట్లు మాత్రమే ఇవ్వాలి, వాటిని సెన్సార్ చేసే అధికారం బోర్డుకు లేదని హైకోర్టు వెల్లడించింది. సినిమాలో ఎక్కువ శాతం సీన్లను కట్ చేస్తే, ఇక సినిమాలో కథాంశం ఏముంటుందని ప్రశ్నించింది. సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడం మాత్రమే సెన్సార్ బోర్డు పని అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. దీనిపై స్పందించిన సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 13 కట్స్‌తో ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.కాగా ఈ సినిమా ఈనెల 17న రిలీజ్ కానుంది.