శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By PNR
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2014 (11:39 IST)

టైటిల్ మార్చుకున్న శంకర్ చిత్రం 'మనోహరుడు'!!

తమిళ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం మనోహరుడు (తమిళంలో ఐ) టైటిల్‌ మారింది. ఈ మేరకు దర్శక నిర్మాత నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ చిత్రం పేరును 'మనోహరుడు'గా దాదాపు ఖరారు చేశారు. ఈ పేరుతోనే ఇన్నాళ్లూ పబ్లిసిటీ కూడా నిర్వహించారు.
 
అయితే, తాజాగా తెలుగు వెర్షన్ టైటిల్ విషయంలో చిన్న మార్పు తెచ్చారు. తెలుగుకి కూడా 'ఐ' అనే టైటిల్ ఉంచుతున్నారు. కాకపోతే, ట్యాగ్ లైన్‌గా 'మనోహరుడు' అనే పేరు ఉంచుతారట. ఇది 'ఐ' పేరిటే అన్ని భాషల్లోనూ పాపులర్ కావడంతో ఈ మార్పు చేసినట్టు సమాచారం. విక్రం, ఎమీ జాక్సన్ జంటగా నటించిన ఈ సినిమా ఆడియో వేడుక సోమవారం చెన్నైలో జరుగనుంది.