బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi

బాహుబలి-2కి తర్వాత జక్కన్న మహాభారతం.. కృష్ణుడిగా అమీర్.. కర్ణుడిగా షారూఖ్.. మరి ఎన్టీఆర్?

2015లో సంచలన దర్శకుడు రాజమౌళి రెండు భాషల్లో నిర్మించిన బాహుబలి భారతీయ చలన చిత్ర రంగాన్నే ఒక వూపువూపింది. ఒక అనువాద చిత్రంగా హిందీ, మలయాళ, ఫ్రెంచ్‌, జర్మన్‌ భాషల్లో కూడా సంచలనాలు రేపింది. బాహుబలి 2కి క

2015లో సంచలన దర్శకుడు రాజమౌళి రెండు భాషల్లో నిర్మించిన బాహుబలి భారతీయ చలన చిత్ర రంగాన్నే ఒక వూపువూపింది. ఒక అనువాద చిత్రంగా హిందీ, మలయాళ, ఫ్రెంచ్‌, జర్మన్‌ భాషల్లో కూడా సంచలనాలు రేపింది. బాహుబలి 2కి కూడా ప్రస్తుతం అదే క్రేజ్ వస్తోంది. బాహుబలి 2కి తర్వాత జక్కన్న మహాభారతాన్ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది. గతంలో ఆమీర్‌ఖాన్‌ తనకు మహభారతంలో కృష్ణుడి పాత్రను పోషించాలని ఉందని, అలాగే షారుఖ్‌ఖాన్‌ కర్ణుడి పాత్రను పోషించాలని వుందని అనడం తెలిసిందే. 
 
అంతేకాదు తన సొంత సంస్ధ తరపున మహాభారత్‌ సినిమా నిర్మిస్తానని కూడా షారుక్‌ ప్రకటించాడు. షారుఖ్‌ఖాన్‌, ఆమీర్‌ఖాన్‌ గతంలో జోష్‌, రంగ్‌దే బసంతి, లండన్‌ డ్రీమ్స్‌ సినిమాలలో కలిసి నటించాల్సింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. అయితే రాజమౌళి మాత్రం బహుబలి-2 తరువాత వెయ్యికోట్ల బడ్జెట్‌తో గరుడ అనే సినిమా నిర్మిస్తానని, ఆ సినిమా నిర్మాణానికి మూడు సంవత్సరాల పట్టవచ్చని సూచనప్రాయంగా తెలిపాడు. ఇందులో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించే అవకాశం లేకపోలేదు. సినీ జనం మాత్రం బాహుబలి2కి తర్వాత మహాభారతం తెరకెక్కనుందని సమాచారం.