గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (14:50 IST)

శ్రద్ధా కపూర్‌తో డేటింగ్‌కు సిద్ధమైన ఫర్హాన్.. ఫస్ట్ సహజీవనం.. ఆ తర్వాత పెళ్లి...

శ్రద్ధా కపూర్, ఫర్వాన్ అక్తర్‌ల మధ్య సమ్‌ థింగ్ సమ్ థింగ్ అంటూ బాలీవుడ్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ జంట డేటింగ్ కోసం రెడీ సిద్ధమైనట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ బ్యూటీ కోసమే ఫర్హాన్ ఖరీదైన బం

శ్రద్ధా కపూర్, ఫర్వాన్ అక్తర్‌ల మధ్య సమ్‌ థింగ్ సమ్ థింగ్ అంటూ బాలీవుడ్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ జంట డేటింగ్ కోసం రెడీ సిద్ధమైనట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ బ్యూటీ కోసమే ఫర్హాన్ ఖరీదైన బంగ్లా తీసుకున్నాడట. ఇంతకీ వీరి సమ్ థింగ్ సమ్ థింగ్ మ్యాటరేంటో ఓ సారి పరిశీలిస్తే... 
 
సాధారణంగా ఒక సినిమాలో కలిసి నటిస్తున్నపుడు హీరో, హీరోయిన్ల మధ్య ఏదో ఉందని పుకార్లు రావడం కామనే. కానీ ఆ తర్వాత కూడా ఇలాంటి వార్తలే హల్ చల్ చేస్తోందంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే. రాక్ఆన్-2లో కలిసి నటించిన శ్రద్ధాకపూర్, ఫరాన్ అక్తర్‌లపై ఇప్పుడు అలాంటి వార్తలే షికార్లు చేస్తున్నాయి.
 
నిజానికి ఫర్హాన్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని శ్రద్ధా కపూర్ చెపుతున్నప్పటికీ.. కానీ వారి ప్రవర్తన మాత్రం మరోలా ఉంది. రాక్ఆన్-2 కంటే ముందే వీరి బంధం మొదలైందని, బాఘీ సక్సెస్ అయినపుడు పార్టీ ఇచ్చిన శ్రద్ధా ఆ పార్టీలో ఫరాన్ అక్తర్‌తో కలిసి శృతి మించి వేసిన చిందులను ఎవరూ మర్చిపోలేదని బీటౌన్ కామెంట్స్. రీసెంట్‌గా ముంబైలో జరిగిన సిటిజెన్ ఫెస్టివల్‌లో కూడా ఈ బ్యూటీ ఫరాన్‌తో కలిసి తిరిగి తమ బంధంపై మరింత క్లారిటి ఇచ్చినట్లు చేసింది.
 
అంతేకాకుండా వీలు చిక్కినపుడల్లా ఈ బ్యూటీ ఫర్హాన్ ఇంటికి వెళ్లుతుందట. లేటేస్ట్‌గా తన రిలేషన్‌ని దాచడం ఎందుకని ఈ జోడి డిసిషన్ తీసుకుందట. అందుకే డేటింగ్ చేయడానికి ఫర్హాన్ బాంద్రాలో ఓ ఖరీదైన ఓ ఇల్లు కొనుక్కున్నాడట. త్వరలోనే ఈ ఇంట్లోకి శ్రద్ధా కపూర్ రాబోతున్నట్లు హాట్ న్యూస్ వినిస్తుంది. కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని వీరు నిర్ణయించుకున్నట్లు టాక్. ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్‌కు ఇద్దరు పిల్లలున్నారు. ఈ డైరెక్టర్ కమ్ హీరో 2000 సంవత్సరవంలో అధున అనే అమ్మాయి పెళ్లి చేసుకుని ఇటీవలే విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే.