Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలికి పోటీగా సంఘమిత్ర.. కేన్స్‌లో ప్రారంభం.. టైటిల్ పాత్రలో శ్రుతిహాసన్

గురువారం, 18 మే 2017 (10:46 IST)

Widgets Magazine
shruti haasan

బాహుబలికి పోటీగా కోలీవుడ్ భారీ బడ్జెట్ మూవీగా సంఘమిత్ర రూపుదిద్దుకోనుంది. బాహుబలి స్ఫూర్తితో బాలీవుడ్‌లోనే కాదు.. ఉత్తరాది, దక్షిణాదికి చెందిన సినీ పరిశ్రమలు భారీ బడ్జెట్ సినిమాలను రూపొందించడంలో తలమునలయ్యాయి. ఈ క్రమంలో బాహుబలి తరహాలో భారీ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించాలని  కమర్షియల్‌ చిత్రాల దర్శకుడు, ఖుష్బూ భర్త సుందర్‌.సి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ప్రాచీన తమిళ భాషను ఉపయోగించనున్నారు. ఆర్య, జయంరవి హీరోలు కాగా, టైటిల్‌ రోల్‌లో శ్రుతిహాసన్‌ నటించనుంది. ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహ్మాన్‌ స్వరాలు అందిస్తున్నారు.
 
శ్రీ తేనాండ్రాల్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై రూ.150 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న సంఘమిత్ర అనే చిత్రాన్ని కేన్స్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేదికపై చాలా గ్రాండ్‌గా ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్‌ బుధవారం ఉదయం కేన్స్‌కు బయల్దేరింది. ఈ విషయాన్ని ఖుష్బూ ట్విట్టర్‌ ద్వారా తెలియజేస్తూ... జయంరవి, ఆర్య, సుందర్‌.సి ఫోటోలను షేర్‌ చేశారు. 8వ శతాబ్దం నాటి చారిత్రక కథతో ‘సంఘమిత్ర’ రూపొందనుంది. 
 
సౌందర్యరాశి, అసమాన ధైర్యసాహసి అయిన సంఘమిత్ర తన రాజ్యాన్ని కాపాడుకొనేందుకు చేసిన పోరాటం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందని ఖుష్బూ తెలిపారు. "బాహుబలి" తరహాలోనే రెండు భాగాలుగా ‘సంఘమిత్ర’ ప్రేక్షకుల ముందుకు రానుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'ఇమైక్క నొడికల్'లో నాలుగేళ్ల బిడ్డకు తల్లిగా నయనతార..

నాలుగేళ్ల బిడ్డకు తల్లిగా నయనతార నటిస్తోంది. థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఇమైక్క నొడికల్ ...

news

రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ, ఫ్యాన్స్‌తో భేటీ... అంతా రోబో 2.0 పబ్లిసిటీ కోసమేనా?

రోబో 2.0 సినిమా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా వివిధ భాషల్లో ...

news

అది మా నాన్న తొలిసారిగా మావద్ద దాచిన మహా రహస్యం.. కట్టప్ప నోట్లోంచి రహస్యం బయటపడలేదన్న కుమార్తె

బాహుబలి స్క్రిప్టును మొత్తంగా నాన్న సత్యరాజ్ ఇంట్లో చెప్పేశారని కానీ కట్టప్ప బాహుబలిని ...

news

రానా బ్రదర్ అయితే.. మరి ప్రభాస్ ఏమవుతాడు...? 'డార్లింగ్‌'పై దేవసేన మనసుపడిందా!

దగ్గుబాటి రానా తనకు సోదరుడు వంటివాడని దేవసేన అనుష్క చెప్పింది. మరీ ప్రభాస్ గురించి ...

Widgets Magazine