గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (14:51 IST)

కూతురు ఎంట్రీ కోసం ఆ హీరో కొడుక్కి గేలం వేస్తున్న శ్రీదేవి... ఎవరతను...?

అతిలోక సుందరి శ్రీదేవికి మళ్లీ సినిమాలపై గాలి మళ్లింది. ఐతే నడి వయసు క్యారెక్టర్లు వస్తుండటంతో కొన్నింటిని తిరస్కరించినట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడదేమీ కాకుండా తన కుమార్తె జాహ్నవిని ఆలస్యం చెయ్యకుండా సినిమాల్లోకి నెట్టేయాలని చూస్తోందని బాలీవుడ్ జనం చెప్పుకుంటున్నారు. అందుకుగాను లాంచింగ్ ప్యాడ్ కావాలి కదా. ఎవరు దొరుకుతారంటూ ఆమధ్య వెతికిన శ్రీదేవికి అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ కనబడ్డాడు. 
 
కానీ అతడు మరో సుందరితో లాంచ్ అయిపోయేందుకు రెడీ అవడంతో మరో హీరో కుమారుడి కోసం శ్రీదేవి వెతుకులాడిందట. అలా వెతుకుతున్న శ్రీదేవికి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు కంట్లో పడ్డాడట. అతడి పక్కన తన కుమార్తెను నటింపజేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు సిగ్నల్స్ ఇచ్చిందట. ఐతే షారుక్ ఖాన్ మాత్రం తమ అబ్బాయిని అప్పుడే సినీ ఇండస్ట్రీలోకి వదిలేది లేదని చెప్పాడట. ఐతే తెర వెనుక జరగాల్సిన ఏర్పాట్లు జరిగిపోతున్నాయంట. మరి బాద్షా చివరికి సరే అంటాడేమో  చూడాలి.