గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Updated : శనివారం, 23 మే 2015 (17:55 IST)

అప్పుడే హీరో ఏంటి?... నిర్మలా కాన్వెంట్ అంటూ గుసగుస

హీరో శ్రీకాంత్‌ తన వారసుడు రోషన్‌ను సినిమాల్లోకి తీసుకువస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవలే ఢీ అంటే ఢీ చిత్రం సక్సెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ... మావాడి గురించి చాలామంది అడుగుతున్నారు. ఆనందంగా వుంది. ఇంకా ఇంటర్‌ కూడా పూర్తిచేయలేదు. పదో తరగతి పరీక్షలు రాశాడు.. ఇప్పుడే వాడి కెరీర్‌ చెడగొట్టదలచుకోలేదు. ఏదైనా చదువు తర్వాతే పని అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. 
 
అయితే శనివారం మాత్రం ఫిలింనగర్‌లో వేరే కథనాలు విన్పిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోలో ఓ మయాళ చిత్రం రీమేక్‌ ద్వారా రోషన్‌ పరిచయం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రెండు టైటిల్స్‌ రిజిష్టర్‌ చేశారట. నిర్మలా కాన్వెంట్‌, పక్కపక్కనే... ఈ టైటిల్స్‌ అన్నపూర్ణ బేనర్‌లో చేసే హీరోలు ఎవ్వరూ లేరు గనుక రోషన్‌కే అని వెల్లడవుతోంది.