Widgets Magazine

దగ్గరికి రామ్మా... కూర్చోమ్మా... అనేవాళ్లతోనా... శృతి హాసన్ మండిపాటు

sruthi hassan
జె| Last Modified సోమవారం, 7 జనవరి 2019 (21:34 IST)
కమలహాసన్ కుమార్తెగా కాకుండా సినీ నటిగానే శృతి హాసన్‌కు ఒక మంచి పేరుంది. తమిళ సినీ పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించి తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న శృతి హాసన్ తాజాగా దర్శకులతో కొన్ని కామెంట్లు చేశారు. షూటింగ్ సమయంలో స్వేచ్ఛ ఇవ్వని దర్శకులతో నేను పనిచేయనని తేల్చేసింది శృతి హాసన్.
నాకు నటన తెలుసు. ఎన్నో సినిమాలు చేశాను. దర్శకుడు నాకు నటన కాదు నేర్పించాల్సింది. నాకు చేయాల్సిన షాట్ చెబితే చాలు నేను చేసేస్తా. అలా కాకుండా దగ్గరికి రామ్మా. కూర్చోమ్మా. ఇలా చేయాలి అని సలహాలిస్తే మాత్రం చేయను. ఎందుకంటే నా నటన అందరికీ తెలుసు. నాకు లక్షలమంది ప్రేక్షకులున్నారంటోంది శృతి హాసన్. దర్సకులకు షరతులు పెడితే శృతి హాసన్ కు అవకాశాలు తగ్గిపోవడం ఖాయమంటున్నారు సినీవిశ్లేషకులు.


దీనిపై మరింత చదవండి :