శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2017 (13:23 IST)

"మా పిన్నికి పుట్టాడు ఈ నందిగాని నంది" అనగానే తలెత్తలేకపోయా: రమకు రాజమౌళి రెండో భర్త?

ప్రముఖ దర్శకుడు బాహుబలి ది కన్‌క్లూజన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్లో సంగీత దర్శకుడు కీరవాణి స్పీచ్ హైలైట్‌గా నిలిచింది. ఈ క్రమంలో కీరవాణి ‘ఎవ‌్వడంట.. ఎవ్వడంటా.. బ

ప్రముఖ దర్శకుడు బాహుబలి ది కన్‌క్లూజన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్లో సంగీత దర్శకుడు కీరవాణి స్పీచ్ హైలైట్‌గా నిలిచింది. ఈ క్రమంలో కీరవాణి ‘ఎవ‌్వడంట.. ఎవ్వడంటా.. బాహుబ‌లి తీసింది.. మా పిన్నికి పుట్టాడు ఈ నందిగాని నంది’ అంటూ దర్శకుడు రాజ‌మౌళిని ఉద్దేశిస్తూ పాడిన పాటకు రాజమౌళి కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. 
 
రాజమౌళి తరహాలోనే తాను కూడా ఎంతో భావోద్వేగానికి గుర‌య్యాన‌ని రాజమౌళి స‌తీమ‌ణి ర‌మా తెలిపారు. మా పిన్నికి పుట్టాడు.. ఈ నందిగాని నంది అని కీరవాణి అనగానే తనకు అత్తమ్మ గుర్తుకొచ్చిందని.. అప్పుడు తనకు ఏడుపు వచ్చేసిందని.. తలకూడా పైకెత్తలేకపోయానని రమా తెలిపారు. ఇంటికి వెళ్లాక యూట్యూబ్‌లో ఆ వీడియో చూశానని.. ఆ వేదిక‌పై స్క్రీన్‌పై త‌న‌ అత్త‌మ్మ ఫొటో కూడా ఉందని తాను అప్పుడే గ్రహించానని చెప్పుకొచ్చారు. 
 
మరోవైపు సినీ గేయ ర‌చ‌యిత‌లు వేటూరి, సీతారామశాస్త్రి తరువాత అంత‌గా ఎవ్వ‌రూ రాయ‌లేక‌పోతున్నార‌ని సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి ట్వీట్ చేసిన ట్వీట్లు వివాదాస్పద‌మైన తరుణంలో ఈ వ్యాఖ్యలపై కూడా రమా రాజమౌళి స్పందించారు. కీరవాణి చేసిన ట్వీట్స్ తనకు తెలుసునని.. వాటిపై వస్తున్న కామెంట్స్‌ను ఏమాత్రం పట్టంచుకోనని తెలిపారు.  కీర‌వాణి త‌న అభిప్రాయాన్ని తెల‌ప‌డం ఆయ‌న‌ ఇష్టమ‌ని, ఆయ‌న‌కు ఆ హ‌క్కు ఉందన్నారు. ఇతరులు కీరవాణి వ్యాఖ్యలపై ఏకీభవించడం, ఏకీభవించకపోవడం అనవసరమని తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. రమా రాజమౌళి తన వ్యక్తిగత జీవితం పట్ల ఆసక్తికర కామెంట్స్ చేసింది. రమా రాజమౌళి ఓ ప్రముఖ ఛానల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2001లో తనకు రాజమౌళితో పెళ్లైందని, అప్పటికే కార్తీక్ అనే కుమారుడున్నాడని చెప్పింది. తాను విడాకులు తీసుకున్న మహిళగా బాహుబలి మేకర్ రాజమౌళి భార్యను అయ్యానని చెప్పింది. అంతేగాకుండా.. తన బాబును ఎప్పటినీ కించపరచకుండా రాజమౌళి తన బిడ్డగానే చూసుకుంటున్నాడని తెలిపింది. 
 
సెల్ ఫోన్లను మరిచిపోవడం, కారు తాళాలు మరిచిపోవడం.. సెల్ ఫోన్ అంటూ టీవీ రిమోట్లను జేబులో వేసుకోవడం వంచి మతిమరుపు రాజమౌళికి ఎక్కువని రమా రాజమౌళి చెప్పింది. బాహుబలి సినిమా రాజమౌళిని పరధ్యానంలో మునిగిపోయేలా చేసిందన్నారు. ఇంకా చెక్‌లపై సరిగ్గా సంతకం చేయడం కూడా రాజమౌళికి రాదని.. ఆటోగ్రాఫ్‌లా చేసే సంతకాలు.. బ్యాంకు ఉద్యోగులకు దిమ్మదిరిగేలా చేసేవని.. ఇలా ఎన్నో చెక్కులు పనికి రాకుండా పోయాయన్నారు. ఫ్యామిలీలో ఏ వస్తువు కనిపించకపోయినా అది రాజమౌళి జేబులో కనిపించేందని తెలిపింది. ఆదివారం వస్తే ఆమె చుట్టాలపిల్లలు ఉంటారని తెలిపింది.