చైతు కోసం సెన్సేష‌న‌ల్ రైట‌ర్ స్టోరీ రాస్తున్నాడా..?

nagachaitanya
శ్రీ| Last Modified గురువారం, 6 డిశెంబరు 2018 (21:20 IST)
అక్కినేని నాగ చైత‌న్య స‌వ్య‌సాచి సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో ఆలోచ‌న‌లో ప‌డ్డాడు. ప్ర‌స్తుతం నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో
సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టిస్తున్నారు. పెళ్లి త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తుండ‌టంతో ఈ సినిమాపై మంచి పాజిటివ్ టాక్ ఉంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఫిబ్ర‌వ‌రికి షూటింగ్ పూర్తి చేసుకుని స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.

ఇదిలా ఉంటే.. స‌వ్య‌సాచి ఫ్లాప్ అవ్వ‌డంతో బాగా డీలాప‌డ్డ చైత‌న్య ఇటీవ‌ల సెన్సేష‌న‌ల్ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ని క‌లిసాడ‌ట‌. విష‌యం ఏంటంటే... చైత‌న్య కోసం విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఓ స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నాడ‌ట‌. అయితే...ఈ స్ర్కిప్ట్ కి డైరెక్ట‌ర్ ఎవ‌రు అనేది మాత్రం తెలియ‌దు. ఇక నుంచి క‌థ‌ల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి అనుకుంటున్నాడ‌ట‌. కెరీర్ బిగినింగ్ నుంచి క‌థ‌ల విష‌యంలో కేర్ తీసుకుంటాను అని చెబుతున్నాడు కానీ.. స‌రైన క‌థ‌ను ఎంచుకోవ‌డంలో ఫెయిల్ అవుతున్నాడు. మ‌రి.. ఇక నుంచైనా మంచి క‌థ‌లు ఎంచుకుంటాడేమో చూడాలి.దీనిపై మరింత చదవండి :