గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: శనివారం, 23 మే 2015 (16:59 IST)

బ్రహ్మానందంకు వడదెబ్బ...? తెలంగాణ నిప్పుల కొలిమి... బయటకొస్తే ఆమ్లెట్టేనట...

ఎండలు మండిపోతున్నాయి. నిప్పు రవ్వలు కూడా అవసరం లేకుండా పూరిళ్లు దగ్ధమవుతాయోమోనన్నంతగా ఎండలు కాస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎండ వేడిమికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఇదిలావుంటే సినీ హాస్య నటుడు బ్రహ్మానందం ఇటీవలే విదేశాల్లో షూటింగ్ ముగించుకుని హైదరాబాదు వచ్చారు.
 
గత మూడురోజులుగా తెలంగాణ రాష్ట్రం నిప్పులగుండంగా మారిపోయి వేడిసెగలతో రగిలిపోతుంటే.. ఒక్కసారి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్‌ నిమిత్తం ఎండలో వచ్చాడట బ్రహ్మానందం. దాంతో ఎండదెబ్బ తగిలి బాగా నీరసంగా వుండడంతో.. షూటింగ్‌ కాన్సిల్‌ చేశారు. ఆయన డేట్స్‌ ఎడ్జెస్ట్‌ చేసి మళ్ళీ తీయనున్నారని తెలిసింది. ప్రస్తుతం ద్రవపదార్థాలే తీసుకంటున్నట్లు తెలిసింది.