బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (17:28 IST)

మోహన్‌ బాబు ఒప్పుకుంటే.. ఆయనతో కలిసి అది చేస్తా.. సన్నీ లియోన్ ఆన్సర్

పోర్న్ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సన్నీలియోన్ బాలీవుడ్‌లో అడుగుపెట్టి సినీ నటిగా అవతారమెత్తింది. మంచు వారసుడు మనోజ్ సరసన 'కరెంట్ తీగ' చిత్రం ద్వారా తన ఆకర్షణీయమైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మధ్య జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సన్నీలియోన్ తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టింది. టాలీవుడ్ నటుడు మోహన్ బాబు అంటే తనకు ఇష్టమని, ఆయనతో కలిసి నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. 
 
గతంలో మోహన్ బాబు కూడా సన్నీ అంటే అభిమానమని బహిరంగంగా వెల్లడించిన విషయం తెల్సిందే. అయితే ఇప్పుడు సన్నీ కూడా ఆ విషయాన్ని బయటపెట్టడంతో సన్నీతో తెరపై నటించేందుకు మోహన్ బాబు నిర్ణయం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అంతేకాదు.. కరెంటు తీగలో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణుతో నటించిన సన్నీ లియోన్.. ఆయన తండ్రితో కూడా వెండితెరను పంచుకుంటే ఎలా ఉంటుందోనని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సో సన్నీ ఆప్లికేషన్‌ను మోహన్ బాబు స్వీకరిస్తారో లేదో వేచి చూడాలి.