Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అప్పుడేమో ఎండలో.. ఇప్పుడేమో వానలో.. సమంత షూటింగ్ కష్టాలు అబ్బబ్బా..!

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (15:27 IST)

Widgets Magazine

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత.. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహానికి అనంతరం కూడా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా వున్న సమంత.. షూటింగ్ స్పాట్స్‌లో తాను ఎదుర్కొనే కష్టాల గురించి ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. చైతూతో పెళ్లికి తర్వాత కూడా సమంతకు సినీ ఆఫర్లు ఏమాత్రం తగ్గలేదు. చేతిలో వున్న సినిమాల షూటింగ్‌లతో తీరిక లేకుండా గడుపుతోంది సమంత. 
 
గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ''రంగస్థలం'' చిత్రంలో నటిస్తున్న సమంత.. అప్పట్లో రాజమహేంద్రవరంలో మండుటెండల్లో షూటింగ్‌లో పాల్గొని వడదెబ్బకు గురైంది. ప్రస్తుతం అదే తరహా కష్టాన్ని ఎదుర్కొంటోంది. కోలీవుడ్ మూవీ సూపర్ డీలక్స్ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.
 
ఈ సినిమా కోసం రాత్రివేళల్లో వర్షంలో జరిపే షూటింగ్‌లో సమంత పాల్గొంటుందట. చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సెట్స్‌కి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత పోస్టు చేసింది. రాజమహేంద్రవరంలో ఎండలో, చెన్నై వానలో షూటింగ్.. దేవుడా తనతో ఎందుకు ఇలాంటి డర్టీ ఆటలు ఆడుతున్నావ్ అంటూ ఏడుస్తున్న ఇమేజ్‌ను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. 
 
ఇకపోతే.. ఈ ఏడాది సమంత నటించిన రంగస్థలం మార్చి 29న, అభిమన్యుడు మార్చి 30న, మహానటి సినిమా కూడా అదే మార్చిలో విడుదల కానుంది. ఇక సమంత చేతిలో శివ కార్తీకేయన్‌తో ఓ సినిమా, విజయ్ సూపర్ డీలక్స్, యూటర్న్ సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'పబ్లిక్‌తో ఎలా ఉండాలో అన‌సూయ‌కి చెప్పండి'.. రష్మీకి అభిమాని ట్వీట్

'పబ్లిక్‌తో ఎలా నడుచుకోవాలో మీ సీనియర్ యాంకర్ అనసూయకు కాస్త చెప్పండి.. వీలైతే ప్రాక్టికల్ ...

news

గాలి మృతిపై బాలయ్య - మోహన్‌బాబు - రోహిత్‌లు ఏమన్నారు?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ శాసనమండలి సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు ...

news

శ్రీదేవిపై ''భాగమతి'' పోటీ: ఇంగ్లిష్ వింగ్లిష్ రికార్డుకు చేరువలో..?

బాహుబలి దేవసేన, అనుష్క ప్రధాన పాత్రగా నటించిన ''భాగమతి'' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ...

news

అనసూయ సోషల్ మీడియాకు నమస్కారం పెట్టేసింది..

యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాకు దూరమైంది. హైదరాబాద్ తార్నాకకు కారులో వెళ్తుండగా.. ఓ ...

Widgets Magazine